భారత యువ క్రికెటర్ పృథ్వీ షాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. భారత జట్టులో చోటు కోల్పోయిన షా.. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుండం ఒక ఎత్తైతే.. మరోవైపు కష్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రికెటర్‌పై ముంబైలో కేసు నమోదైంది.
భారత యువ క్రికెటర్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అతనిపై ముంబైలో కేసు నమోదైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ దాఖలు ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పృథ్వీ షా తనతో అనుచితంగా ప్రవర్తించాడని, తాకరాని చోట తాకాడని సప్నా గిల్ పోలీసులకు పిర్యాదు చేసింది. అందుకు సాక్ష్యాలుగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్ట్‌ను జత చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 354, 509, 324 కింద కేసు నమోదు చేశారు.
గతనెల(ఫిబ్రవరి) 16న పృథ్వీ షా తన స్నేహితులతో కలిసి ముంబై, శాంతాక్రూజ్‌పరిధిలోని ఓ స్టార్ హోటల్‌కు డిన్నర్ చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికొచ్చిన కొంతమంది పృథ్వీ షాను సెల్ఫీ కోసం అడిగారు. వారి కోరిక మేరకు మొదట ఓ సెల్ఫీ దిగేందుకు అనుమతించిన పృథ్వీషా.. ఆ తర్వాత పదేపదే అడగడంతో నిరాకరించారు. ఈ క్రమంలో షా వారి వదిలించుకుని వెళ్లిపోతున్న క్రమంలో దారి మధ్యలో అటకాయించి, షా ప్రయాణిస్తున్న కారుపై బేస్ బాల్ స్టిక్స్‌తో దాడికి తెగబడినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు షా అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సప్నా గిల్ సహా ఎనిమిది అరెస్టు చేశారు. ఈ కేసులో ఇన్‌స్ట్రాగామ్ మోడల్ సప్నా గిల్ కూడా అరెస్ట్ అయి కొన్ని రోజలు రిమాండ్‌లో ఉండి, బెయిల్‌పై బయటికి వచ్చారు.
అలా బెయిల్‌పై బయటకొచ్చిన సప్నా గిల్ పృథ్వీ షాపై ఫిర్యాదు చేయగా.. ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సప్నా గిల్.. పృథ్వీషాపై తీవ్ర లైంగిక ఆరోపణలు చేసింది. సెల్ఫీ కోసం తన స్నేహితులు వెళ్తే పృథ్వీషా వారితో గొడవపడ్డాడని.. తాను కలుగజేసుకొని మాట్లాడేందుకు వెళ్లగా తనను అనుచితంగా తాకాడని, నెట్టాడంటూ ఆరోపించింది. అతనితో పాటు అతని స్నేహితుడైన సురేంద్ర యాదవ్, మరో యువకుడు భగవత్ గారండేపై కూడా సప్నా గిల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ఈ నెల 17న విచారణకు రానున్నది. ఈ విషయంపై.. పృథ్వీ షా ఎలా స్పందనేంటో తెలియాల్సి ఉంది. సప్నా గిల్ ఆరోపణలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Fight between Indian Cricketer Prithvi Shaw vs Influencer Sapna Gill#PrithviShaw #SapnaGill pic.twitter.com/SX1TFfVPV6
— Kapil Kumar (@kapilkumaron) February 16, 2023
Kalesh B/w Prithvi Shaw And Influencer Sapna Gill on Roadpic.twitter.com/QI88XpqHuX
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 16, 2023