భారత యువ క్రికెటర్ పృథ్వీషాను కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తాకరాని చోట తాకాడంటూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు అతనికి నోటీసులు జారీ చేసింది. దీంతో పృథ్వీషా క్రికెట్ కెరీర్ ఏమవుతుందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పృథ్వీ షా తనను తాకరాని చోట తాకుతూ, అనుచితంగా ప్రవర్తించాడు అంటూ ముంబై కోర్టులో పిటీషన్ ను దాఖలు చేసింది మోడల్ సప్నాగిల్ . దాంతో అతడిపై కేసు నమోదు చేశారు చేశారు. ఇక ఈ కేసులో షా జైలుకు వెళ్లడం ఖాయమేనా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. భారత జట్టులో చోటు కోల్పోయిన షా.. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుండం ఒక ఎత్తైతే.. మరోవైపు కష్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రికెటర్‌పై ముంబైలో కేసు నమోదైంది.
సెల్ఫీ ఇవ్వలేదని టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటనలో దాడి చేసిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు ఓషివారా పోలీసులు. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.