అది ఏ ఫీల్డ్ అయినా సరే కొందరికి టాలెంట్ ఉండి కూడా ఛాన్సులు రావు. కొందరికి టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలు రాకపోవడం వల్ల వెనకబడిపోతారు. అలాంటి వారిలో టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ ఒకడు. మనోడు బాగానే ఆడతాడు. కానీ సరైన ఛాన్సులు దక్కట్లేదని అతడి ఫ్యాన్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రపంచకప్, సిరీస్ లు జరిగినప్పుడు సంజూ శాంసన్ పేరు కచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే సెలెక్టర్ల నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. తీరా ఓ సిరీస్ కోసం జట్టులోకి తీసుకుంటే మాత్రం చెత్త ఆటతీరుతో ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరుస్తాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సంజూ శాంసన్ కు మన దేశంలో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. టీమిండియా ఓ సిరీస్, టోర్నీ కోసం జట్టు ప్రకటించడమే లేటు, శాంసన్ పేరు ఉంటే సరేసరి. లేదంటే మాత్రం అభిమానులు సోషల్ మీడియాలో గొడవగొడవ చేస్తారు. సంజూ మంచి క్రికెటర్, సరైన ఛాన్సులివ్వట్లేదు. ఇస్తే ప్రూవ్ చేసుకుంటాడు అని చాలా మాట్లాడతారు. కానీ రియాలిటీలో మాత్రం జరుగుతున్నది వేరులా కనిపిస్తుంది. తాజాగా టీమిండియా- శ్రీలంక మధ్య తొలి టీ20నే అందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్ లో సంజూకి ఆడే ఛాన్స్ వచ్చింది. కానీ పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉంది. ఇందుకోసం కోహ్లీ, రోహిత్ లాంటి సీనియర్స్ కు విశ్రాంతినిచ్చి.. హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో కుర్రాళ్లతో స్ట్రాంగ్ టీమ్ తయారు చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే చాలామంది కొత్త, పాత వాళ్లకు అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంకతో తాజాగా జరుగుతున్న టీ20 సిరీస్ కు సంజూని సెలెక్ట్ చేసింది. ఇక మ్యాచ్ లో కూడా ఛాన్స్ ఇచ్చారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన శాంసన్.. క్రీజులో నిలబడి సరైన ఇన్నింగ్స్ ఆడుంటే, హెడ్ లైన్స్ లో మనోడి గురించి మోత మోగిపోయేది. కానీ అలా జరగలేదు. 6 బంతులాడి కేవలం 5 పరుగులే చేశాడు. ఓ చెత్త షాట్ ఆడి ఔట్ అయిపోయాడు.
ఉన్న కాసేపటిలోనూ లంక బౌలర్లు, క్యాచ్ వదిలి సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇచ్చినా సరే దాన్ని సంజూ సద్వినియోగం చేసుకోలేపోయాడు. ఫీల్డింగ్ లోనూ ఓ క్యాచ్ వదిలేశాడు. ఇలా ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోక, నిరాశపరిస్తే.. ‘ఎందుకు నీకు సపోర్ట్ చేయాలి’ అని సంజూపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు నుంచి తీసేయండని కూడా ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ముంబయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత, టీమిండియా 162/5 స్కోరు చేసింది. అనంతరం శ్రీలంక 160 పరుగులకు ఆలౌటైంది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ని 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. సరే ఇదంతా పక్కనబెడితే.. సంజూపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Sanju Samson deserve bharat ratna according to his fan !!! #SanjuSamson pic.twitter.com/7kwQA40Apb
— D (@A7pha_) January 3, 2023