ఐపీఎల్ 2023 సీజన్ కోసం కొచ్చి వేదికగా నిన్న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కోట్ల వర్షం కురిసింది. సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, నికోలస్ పూరన్, కామెరున్ గ్రీన్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యారు. కొంతమందిపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజ్‌లు.. మరికొంతమందికి నిరాశ మిగిల్చాయి. ఈ మినీ వేలంలో 80 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. చాలా మంది ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. సామ్ కర్రన్‌ను రూ.18.5 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యంత భారీ ధర. ఇక మరో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లు పెట్టి దక్కించుకుంది. అలాగే ఆసీస్ యువ క్రికెటర్ కామెరున్ గ్రీన్‌కు రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. గత ఐపీఎల్ సీజన్స్ అంత గొప్ప రికార్డు ఏం లేకపోయినా.. విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు అసలు ఊహించని ధర దక్కింది. రూ.16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ దక్కించుకుంది. హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ మినీ వేలంలో సర్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు చాలా దూకుడుగా వ్యవహరించాయి. టార్గెట్‌గా పెట్టుకున్న ఆటగాళ్ల కోసం వేలంలో దూసుకెళ్లాయి. ఆరంభంలోనే హ్యారీ బ్రూక్ కోసం రూ.13 కోట్లకు పైనే ఖర్చు పెట్టిన సన్‌రైజర్స్ పోటీలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అలాగే.. సామ్ కర్రన్ కోసం పంజాబ్ కింగ్స్ ఉన్న డబ్బులన్ని కుమ్మరించేందుకు సిద్ధమైంది. కానీ.. మిగతా ఫ్రాంచైజీల వద్ద అంతకు మించి నిధులు లేకపోవడంతో.. వారు పోటీ నుంచి తప్పుకోవడంతో.. పంజాబ్ కింగ్స్ సామ్‌ను సొంతం చేసుకుంది. సామ్ కోసం చెన్నై, ముంబై ఇండియన్స్.. పంజాబ్ కింగ్స్‌తో పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ధర.. రూ.18.50 కోట్లకు సామ్‌ను తమ టీమ్‌లోకి తెచ్చుకుంది. సామ్ తొలి సారి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి ఆడింది పంజాబ్‌కే కావడం విశేషం.
అయితే.. ఈ మినీ వేలంలో కళ్లు తిరిగి పడిపోయే ధరను సామ్ కర్రన్ దక్కించుకుంటే.. ఇదే వేలంలో పాల్గొన్న అతని అన్న టామ్ కర్రన్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. సోదరులైన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు ఆడాడు. టామ్ కర్రాన్, సామ్ కర్రన్.. జింబాబ్వే మాజీ క్రికెటర్ కెవిన్ కర్రన్ కుమారులు. కర్రన్ ఫ్యామిలీ జింబాబ్వే నుంచి ఇంగ్లండ్‌కు వలస వచ్చింది. ఆ తర్వాత తండ్రి బాటలోనే టామ్ కర్రన్, సామ్ కర్రన్ ఇద్దరూ క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు. పైగా ఇద్దరూ ఆల్‌రౌండర్లే. సామ్ కర్రన్ చిన్నవాడు కాగా.. టామ్ కర్రన్ పెద్దవాడు. సామ్ కర్రన్‌కు ఐపీఎల్ చరిత్రలోనే భారీ ధర ఇచ్చి.. నెత్తిన పెట్టుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు.. టామ్ కర్రన్‌ను మాత్రం రూ.75 లక్షల బేస్ ప్రైజ్‌కు కూడా ఎవరూ కొనలేదు. కాగా.. సామ్ కర్రన్ ఇటివల ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో అద్భుత ప్రదర్శన కనబర్చి.. ఇంగ్లండ్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అందుకే సామ్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు పోటీపడ్డాయి. మరి సామ్ కర్రన్‌కు దక్కిన ధరపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
conversation btw Sam Curran and Tom Curran after today’s IPL Auction pic.twitter.com/38pyaF4vLg
— retired ICT fan (@anubhav__tweets) December 23, 2022
Pic of the day 💛💙
Sam Curran and Tom Curran #CSKvDC pic.twitter.com/M7gFpHAEBc— UP wale Bhaiya (@mard_tweetwala) April 10, 2021