టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీ కొన్ని సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా కొనసాగుతున్నాడు. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్(2023)తో ధోనీ తన చివరి ఐపీఎల్ ఆడేసినట్లేనని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత ధోనీ కామెంటరీవైపు మొగ్గు చూపుతాడా..? లేక కోచింగ్ వైపు అడుగులేస్తాడా..? అన్న ప్రశ్నకు యూట్యూబ్ ఛానెల్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజులో ఇంటిదారి పట్టిన భారత జట్టు, 2022 టోర్నీలో సెమీస్ నుంచి నిష్కమించింది. ఇది మొదటిసారి కాదు. ద్వైపాక్షిక సిరీసుల్లో విజయకేతనం ఎగరవేస్తున్నా, ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీల్లో మాత్రం పదే పదే తడబడుతోంది. అందులోనూ నాకౌట్ మ్యాచుల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అవమానకర రీతిలో ఉంటోంది. దీనిని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుందట. జట్టును మెరుగుపరచడానికి, టీమిండియా మాజీ సారధి ధోనీని జట్టులోకి ఆహ్వానించి కీలక పదవిని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. టీ20 జట్టుకు ధోనిని ప్రత్యేక కోచ్‌ని నియమించి ద్రవిడ్ పై ఒత్తిడి తగ్గించాలని చూస్తోందట. ఈ విషయంపై తాజాగా సల్మాన్ భట్ స్పందించాడు.
India vs England Seen 😂#TeamIndia#INDvsENG#irfanpathan pic.twitter.com/Oq9UkX937P
— 🇫🇦🇮🇸🇦🇱 🇰🇭🇦🇳 ➐ (@Faizeejan4) November 10, 2022
“ధోనీ లాంటి ప్లేయర్ దొరకడం టీమిండియా అదృష్టం. ఒత్తిడిని ఎలా అధిగమించాలో అతనికి బాగా తెలుసు. ప్లేయర్లను ఎంత త్వరగా అర్థం చేసుకోగలడో.. అంతే త్వరగా గేమ్‌ని రీడ్ చేస్తాడు. అందుకే అంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్ కాగలిగాడు. మాహీ గొప్ప కెప్టెన్ మాత్రమే కాదు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కూడా. ప్రతీ చిన్న విషయంలో ధోనీ తీసుకునే నిర్ణయాలు చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేవి. ఏ జట్టుకి అయినా ధోనీ లాంటి మాస్టర్ మైండ్ ఉన్న క్రికెటర్ దొరకడం గొప్ప ఆస్తి కిందే లెక్క. మాహీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే టీమిండియాకి మరిన్ని విజయాలను అందించేవాడు. ఇప్పటికైనా అతనిని టీమిండియాకి కోచ్‌గా నియమిస్తే బాగుంటుంది. ప్లేయర్లపై ఒత్తిడిని తగ్గించి, వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టగలడు..” అని తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు సల్మాన్ భట్.
కాగా, ధోనీ తన క్రికెట్ కెరీర్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిపెట్టాడు. టెస్టుల్లో భారత జట్టును నెం.1గా నిలిపాడు. వన్డే, టీ20 సిరీసుల్లో ఫినిషర్‌గానూ అద్భుత విజయాలు అందించాడు. ఇక ధోని 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. 2019 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో చివరిసారిగా ధోనీ భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీని ధోనీ ముట్టుకోలేదు. ఇక ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు.