టీమిండియాలోకి ఎంతోమంది క్రికెటర్లు వచ్చుండొచ్చు. కానీ క్రికెట్ గాడ్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఒక్కటే. అదే సచిన్ టెండూల్కర్. టీనేజ్ లోకి జట్టులోకి వచ్చిన సచిన్… తన అసమాన ఆటతీరుతో దాదాపు 25 ఏళ్లపాటు జట్టులో కంటిన్యూ అయ్యాడు. ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు చేశాడు. ఇక 90 పరుగుల దగ్గర సచిన్ ఔటైన సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ఒకవేళ అవి గనుక శతకాలుగా మారి ఉంటే.. మరో 20-30 సెంచరీలు తన ఖాతాలో చేరి ఉండేవి.
ఇక విషయానికొస్తే.. సచిన్ అందరితోనూ సత్సంబంధాలు మెంటైన్ చేస్తూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ కు మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. దీంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే ఫ్యాన్స్ అస్సలు టెన్షన్ పడకుండా.. అసలేం జరిగింది? సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో కూడా ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో కలిసి హిందీ కామెంటేటర్ గా బిజీగా ఉన్న ఆర్పీ సింగ్.. తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లో జరిగిన ఓ డిఫరెంట్ రనౌట్ మాట్లాడాడు. సాల్ట్ ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్, బౌలర్ కాలికి తాకి నేరుగా వెళ్లి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న స్టంప్స్ ని తాకింది. అప్పటికే సింగిల్ కోసం క్రీజు వదిలొచ్చిన దే బర్న్ రనౌట్ అయ్యాడు.
2006 సెప్టెంబరులో వెస్టిండీస్ తో వన్డేలో సచిన్ కూడా సేమ్ ఇలానే రనౌట్ అయ్యాడు. దానికి కారణం ఆర్పీ సింగ్. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. 162 పరుగులకు ఆలౌటైంది. చెప్పాలంటే ఎక్కువ పరుగులే చేసేది. అయితే మ్యాచ్ లో కుదురుగా నిలబడి ఆడిన సచిన్ ని ఔట్ చేయడానికి విండీస్ బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. మిగతా బ్యాటర్లని ఔట్ చేసినా సరే.. సచిన్ వికెట్ మాత్రం తీయలేకపోయారు. ఇక శ్యామ్యూల్స్ బౌలింగ్ లో ఆర్పీ బ్యాటింగ్ చేస్తూ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అదికాస్త బౌలర్ చేతికి తగిలి వికెట్లను తాకింది. క్రీజు వదిలొచ్చిన సచిన్ ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచులో విండీస్ 146 పరుగులకే ఔటై ఓటమిపాలైంది. ఇక అప్పటి విషయాన్ని ఇప్పుడు గుర్తుచేసుకున్న ఆర్పీ సింగ్.. ‘సచిన్ పాజీకి ఓపెన్ గా సారీ చెబుతున్నా.ఆ రోజు నేను స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాకుండా ఉండాల్సింది’ అని ఆర్పీ సింగ్ కామెంటరీ చేశాడు. ఈ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆకాశ్ చోప్రా.. ఆర్పీ సింగ్ బదులు సారీ చెప్పుకొచ్చాడు. మరి అప్పుడెప్పుడో జరిగినది గుర్తుంచుకుని మరీ సచిన్ కు క్షమాపణలు చెప్పడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Here is The Video of That Dismissal@cricketaakash @rpsingh @sachin_rt Sir. pic.twitter.com/3tm3AMgSpi https://t.co/LsoBHeF7NK
— CrickeTendulkar 🇮🇳 (@CrickeTendulkar) January 19, 2023