క్రికెట్‌లో డకౌట్(పరుగులు చేయకుండా అవుట్ అవ్వడం) బ్యాటర్‌ను ఎంతో మనోవేదనకు గురిచేస్తుంది. కొత్తగా జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లతో పాటు, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో డకౌట్ అయితే స్టార్లు సైతం తీవ్ర నిరాశ చెందుతారు. ఇందుకు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ కూడా అతీతం కాదు. అతను కూడా పలు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. కానీ.. 2007 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా డకౌట్ అవ్వడం తనను ఎంతో ఆవేదనకు గురించేసిందని టేలర్ అన్నాడు. ఎందుకంటే టేలర్‌కు అది తొలి వరల్డ్ కప్ తొలి మ్యాచ్.
తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అవ్వడం టేలర్‌ను కుంగదీసింది. పైగా ఈ డకౌట్ వెనుక ఒక డక్ ఉన్నట్లు టేలర్ ఆసక్తి కర విషయాన్ని వెల్లడించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టేలర్.. తాజాగా తన ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. ‘రాస్ టేలర్ వైట్ అండ్ బ్లాక్’ అనే ఈ పుస్తకంలో పలు సంచలనమైన, ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఈ క్రమంలో తన తొలి వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన విషయం గురించి చెప్తూ.. ‘ఆ మ్యాచ్‌కు ముందు రాత్రి విక్టోరియాతో కలిసి ఒక రెస్టారెంట్‌కు వెళ్లాను. అక్కడ నాకు ఎంతో ఇష్టమైన చైనీస్ డిష్‌ను ఆర్దర్‌ఇచ్చి.. మంచిగా వేయించిన బాతును తిన్నాను. మరునాడు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఫ్లింటాఫ్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు డకౌట్ అయ్యాను. దీంతో జీవితంలో మరోసారి బాతు మాంసం తొనొద్దని గట్టిగా నిర్ణయంచుకున్నాను.
కానీ.. ఆ తర్వాత కొన్ని రోజులకు మరోసారి స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లాను. అప్పుడు స్నేహితులు బాతు మాంసం తినాలని బలవంతం చేశారు. కానీ నేను ససేమీరా అన్నాను. మరుసటి రోజు మ్యాచ్ ఉంటే తినకు. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజలు సమయం ఉంది. తిను పర్వాలేదు అని బలవంతం చేయడంతో మళ్లీ బాతు మాంసం గట్టిగా లాగించాను. రెండు రోజుల తర్వాత మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయ్యాను. దీంతో మళ్లీ ఎప్పుడూ బాతు మాంసం తినలేదు’ అని టేలర్ పుస్తకంలో పేర్కొన్నాడు. ఇలా బాతు మాంసంతో తన డకౌట్‌ను ఉన్న లింక్‌ను వివరించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
Ross Taylor talks the late, great Martin Crowe in this exclusive interview ahead of the release of his book “Ross Taylor: Black & White” 🖤
Catch the full interview on our YouTube channel now. #RossTaylor #SkySportNZ pic.twitter.com/QpGdGCUpPQ
— Sky Sport NZ (@skysportnz) August 12, 2022
ఇది కూడా చదవండి: ‘బయట కనిపించేదంతా నిజం కాదు..’ రాస్ టేలర్ ఆత్మకథలో సంచలన విషయాలు!