ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో వైఫల్యం తర్వాత.. టీమిండియాలో భారీ మార్పుల చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు టోర్నీల్లో విఫలం చెందిన భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికైనా జట్టు కూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని క్రీడానిపుణులతో పాటుగా మాజీ దిగ్గజాలు సైతం సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అతడి చిన్ననాటి కోచ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు రోహిత్ కు సిరీస్ కు సిరీస్ కు మధ్య విశ్రాంతి ఎందుకు ఇస్తున్నారని మండిపడ్డాడు. ఓటమికి సాకులు చెప్పడం మాని.. దేశానికి ట్రోఫీలు తేవాలంటే ముందు IPL ఆడటం మానెయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ.. గత కొంత కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొటున్నాడు. అదీకాక సారథిగానూ.. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అయ్యాడు రోహిత్. దాంతో రోహిత్ శర్మపై, జట్టు సెలక్షన్ కమిటీపై దారుణంగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేశ్.. రోహిత్ పై సంచలన కామెంట్స్ చేశాడు. అతడు మాట్లాడుతూ..”రోహిత్ ముందు నువ్వు ఓటమికి సాకులు చెప్పడం మానేయాలి. ఇక ఇండియాకు ట్రోఫీలు, వరల్డ్ కప్ లు అందివ్వాలి అంటే ముందు IPL ఆడటం మానెయ్. ఇక టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ కు రెస్టు ఇవ్వాల్సిన అవసరం ఏముంది. అదీగాక ప్రొఫెషనల్ క్రికెటర్లకు వర్క్ లోడ్ సమస్య ఏంటి?” అంటూ కోచ్ దినేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అదీకాక ఒకవైపు తీరిక లేకుండా ఐపీఎల్ ఆడుతూ.. వర్క్ లోడ్ అంటే ఎలా? అని విమర్శించాడు. దేశం కోసం ఆడేటప్పుడు కాంప్రమైజ్ అవుతానంటే కుదరదు. అసలు రోహిత్ ఇన్ని సార్లు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు కోచ్ దినేశ్. సారథిగా ఉన్నప్పుడు.. నిత్యం టీమ్ తోనే ఉంటూ.. లోటు పాట్లను చూసుకుంటూ ముందుకు పోవాలని దినేశ్ హితవు పలికాడు. ఈ సందర్బంగా బీసీసీఐ పై కూడా మండిపడ్డాడు దినేశ్. రోహిత్ శర్మకు సిరీస్ కు సిరీస్ కు మధ్య విశ్రాంతి ఎందుకు ఇస్తున్నారో నాకైతే అర్దం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రోహిత్ కోచ్ దినేశ్ చేసిన వ్యాఖ్యలు క్రీడాలోకంలో చర్చనియాంశంగా మారాయి.