2023 ప్రపంచ కప్ గెలవడమే ధ్యేయంగా టీమిండియా ఈ సంవత్సరాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే అద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్తోంది. కొత్త ఏడాది స్టార్టింగ్ లోనే శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ లను కైవసం చేసుకుని ప్రపంచ కప్ వేటను ఘనంగా ప్రారంభించింది. ఇదే ఆటతీరుతో న్యూజిలాండ్ ను సైతం మట్టి కరిపించాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో విలేకరులతో ముచ్చటించాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. ఈ సందర్భంగా టీమిండియా యువ బౌలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రధాన బౌలర్ ఇతడే అంటూ కితాబిచ్చాడు. బుమ్రా లేని లోటును ఈ యంగ్ స్పీడ్ స్టర్ తీరుస్తున్నాడు అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా బౌలింగ్ దళానికి వెన్నుముకగా నిలుస్తూ వస్తున్నాడు. అయితే వెన్నుముక గాయం కారణంగా గత కొంత కాలం నుంచి జట్టుకు దూరం అయ్యాడు బూమ్రా. దాంతో భారత బౌలింగ్ దళం వీక్ అయ్యింది. దాంతో ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో టీమిండియాకు పరాభవం తప్పలేదు. అయితే గత కొంత కాలంగా బుమ్రా లేని లోటును తీరుస్తున్నాడు హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్. ప్రస్తుతం సిరాజ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ తో తన హోం గ్రౌండ్ లో జరగబోయే మ్యాచ్ కు సిరాజ్ సర్వం సిద్దం అయ్యాడు. ఈ క్రమంలోనే సిరాజ్ పై ప్రశంసల వర్షం కురింపించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతడు మాట్లాడుతూ.. “గత కొంతకాలంగా సిరాజ్ ను నేను గమనిస్తూనే ఉన్నాను. రెండు సంవత్సరాలుగా అతడి ప్రదర్శన రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొత్త బంతితో సిరాజ్ అద్భుతాలు చేసి ప్రత్యర్థికి చుక్కలు చూపించగలడు. వచ్చే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రధానాస్త్రం సిరాజే. మూడు ఫార్మాట్లలోనూ సిరాజ్ అద్భతంగా రాణిస్తున్నాడు. ఇది టీమిండియాకు మంచి పరిణామం” అని సిరాజ్ ని ప్రశంసించాడు రోహిత్ శర్మ.
అదీకాక వరల్డ్ కప్ దగ్గరపడుతుండటంతో సిరాజ్ పై వర్క్ లోడ్ ఎక్కువ పెట్టాల్సి వస్తోందని ఈ సందర్భంగా రోహిత్ చెప్పుకొచ్చాడు. అదీకాక ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో అత్యధిక వికెట్లు(9) తీసిన బౌలర్ గా సిరాజ్ నిలిచాడు. దాంతో రానున్న ప్రపంచ కప్ లో కచ్చితంగా సిరాజ్ టీమిండియాకు కీలక ప్లేయర్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని క్రీడానిపుణులతో పాటుగా అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా, భువనేశ్వర్ ల కంటే ఈ ప్రపంచ కప్ లో సిరాజ్ ఎక్కువగా ప్రభావం చూపుతాడు అని రోహిత్ పేర్కొన్నాడు. మరి మహ్మద్ సిరాజ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma said “Rise of Siraj is a big positive for India in World Cup year”.
— Johns. (@CricCrazyJohns) January 18, 2023