ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కొరకు.. ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అందుకోసం ఐపీఎల్ మధ్యలోనే ఆటగాళ్లను ఇంగ్లాండ్ పంపిస్తామని రోహిత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే జోరును రాబోయే వన్డే సిరీస్ లోనూ చూపించాలని భావిస్తోంది టీమిండియా. ఇక దీనితో పాటుగా ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పై ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది రోహిత్ సేన. అందుకు తగ్గ వ్యూహాలను ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే వెంటవెంటనే ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో.. ఆటగాళ్ల వర్క్ లోడ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు రోహిత్ శర్మ. దానికోసం ఓ మాస్టర్ ప్లాన్ ను రడీ చేశామని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు విశ్రాంతి లేకుండా టోర్నీల్లో పాల్గొంటున్నారు. దాంతో సహజంగానే ప్రతీ ఆటగాడిపై వర్క్ లోడ్ ఉంటుంది. పైగా మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఒత్తిడి మెుత్తం ఆటగాళ్లపై పడకుండా ప్లాన్ చేస్తున్నామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ..”వెంటవెంటనే ఐపీఎల్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఉండటం వల్ల ఆటగాళ్లు సహజంగానే వర్క్ లోడ్ కు గురౌతుంటారు. ఇక ఈ విషయం మాకు కాస్త ఇబ్బందికరమైందే. అయితే మే 21 నాటికి ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు అన్ని ముగుస్తాయి. దాంతో ప్లే ఆఫ్ నుంచి ఆరు జట్లు నిష్ర్కమిస్తాయి. ఆ జట్లలో అందుబాటులో ఉన్న ఆటగాళ్లను వీలైనంత త్వరగా ఇంగ్లాండ్ కు పంపుతాం” అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇక WTC ఫైనల్ ఆడబోయే ఆటగాళ్లందరితోనే మేము నిరంతరం టచ్ లోనే ఉంటాం. వారి శారీరక, మానసిక, వర్క్ లోడ్ ఏ విధంగా ఉందో మేం గమనిస్తూనే ఉంటామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్ కు జట్టు ఎంపిక అనేది పెద్ద సమస్య కానేకాదు అని ఈ సందర్భంగా రోహిత్ అన్నాడు. అదీకాక ఐపీఎల్ ఫైనల్లో ఆడే ఆటగాళ్లు డబ్ల్యూటీసీలో ఉండేవాళ్లు కాదనే అనుకుంటున్నా అని షాకింగ్ కామెంట్స్ చేశాడు రోహిత్ శర్మ. కాగా జూన్ 9న ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆసిస్ తో జరగనుంది. మరి ఐపీఎల్ మధ్యలోనే ఆటగాళ్లను ఇంగ్లాండ్ పంపుతాం అన్న రోహిత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.