మూడు వన్డేలు, 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కివీస్ భారత పర్యటనకు వచ్చింది. ఇక శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ లు గెలిచి మంచి జోరుమీదుంది టీమిండియా. అదే జోరును న్యూజిలాండ్ పై కూడా చూపిస్తోంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి రెండు వన్డేలను గెలుచుకుని సిరీస్ ను చేజిక్కించుకున్నది. తాజాగా మంగళవారం జరుగుతున్న చివరిది అయిన నామమాత్రపు వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఫెర్గ్యూసన్ వేసిన 8వ ఓవర్లో గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్.. తన విశ్వరూపాన్ని చూపాడు. అద్భుతమైన సిక్స్ తో 4 ఫోర్లు బాది మెుత్తం ఈ ఓవర్లో 22 పరుగులు పిండుకున్నాడు. అయితే ఈ ఓవర్లో గిల్ కొట్టిన సిక్స్ కు రోహిత్ ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది.
— Hardin (@hardintessa143) January 24, 2023
శుభ్ మన్ గిల్.. ప్రస్తుతం ఈ టీమిండియా క్రికెట్ లో మారుమ్రోగుతున్నపేరు. హైదరాబాద్ వేదికగా కివీస్ తో జరిగిన రెండో వన్డేలో డబుల్ సెంచరీ బాదీ.. ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం అదే జోరును కొనసాగిస్తున్నాడు ఈ యంగ్ బ్యాటర్. తాజాగా ఇండోర్ వేదికగా మంగళవారం జరుగుతున్న మూడో వన్డేలో కూడా తన దూకుడును కొనసాగిస్తున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోతున్నాడు. ఇక ఈ ఇన్నింగ్స్ లో 8వ ఓవర్ వేసిన ఫెర్గ్యూసన్ కు చుక్కలు చూపించాడు గిల్. ఈ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ తో ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఇక ఈ ఓవర్ లో గిల్ అద్భుతమైన సిక్స్ కొట్టాడు. షార్ట్ లెంగ్త్ బాల్ ను బ్యాక్ వర్డ్ పాయింట్ మీదుగా గిల్ సిక్స్ కొట్టిన తీరు అమోఘం. ఆ షాట్ ను చూసిన రోహిత్ శర్మ.. భలేగా కొట్టాడు అన్నట్లుగా ఫన్నీ రియాక్షన్ ఇచ్చాడు. రోహిత్ ఇచ్చిన ఆ రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో భారత ఓపెనర్లు రెచ్చిపోతున్నారు.
— Hardin (@hardintessa143) January 24, 2023