భారత్- ఆస్ట్రేలియా మధ్య ఎంతో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేపు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇరు జట్లు ప్రాక్టీస్ ముగించుకొని ఇక మ్యాచ్ కి సిద్ధమైన తరుణంలో ఇప్పుడు రోహిత్ శర్మ గాయం టీమిండియాని కొత్త టెన్షన్ కి గురి చేస్తుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు గాయాల బెడద తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికీ గాయాల కారణంగా దాదాపు అరడజను మంది ప్లేయర్లు ఈ ఫైనల్ కి దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు పంత్, బూమ్రా, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్లు లేకుండానే భారత్ ఈ మ్యాచులో బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ ముగించుకొని ఇటీవలే ఇంగ్లాండ్ లోకి అడుగుపెట్టిన టీమిండియా.. ప్రాక్టీస్ ముమ్మరంగా చేస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ కి షాకిచ్చే ఒక న్యూస్ బయటకు వచ్చింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి గాయమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం టీమిండియా అభిమానులని కలవరపెడుతుంది.
అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రేపు ప్రారంభం కానుంది. ఇరు జట్లు ప్రాక్టీస్ ముగించుకొని ఇక మ్యాచ్ కి సిద్ధమైన తరుణంలో ఇప్పుడు రోహిత్ శర్మ గాయం కొత్త టెన్షన్ కి గురి చేస్తుంది. దీని ప్రకారం హిట్ మ్యాన్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా.. అతని ఎడమ చేతి బొటనవేలికి నేరుగా బంతి తగిలినట్లుగా క్రికెట్ వర్గాలు తెలిపాయి. రోహిత్ తన బొటన వేలుకు టేపు చుట్టుకున్న ఫోటోని షేర్ చేస్తున్నారు. ఈ కారణంగా ప్రాక్టీస్ చేయకుండా రెస్టు తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. రోహిత్ శర్మ టీమిండియాకు కీలక ప్లేయర్ తో పాటుగా కెప్టెన్ కూడా. సరిగ్గా ఫైనల్ కి ముందు ఇలా గాయపడడం ఆందోళనకి గురి చేస్తుంది.
ఇక భారత్- ఆస్ట్రేలియా మధ్య ఎంతో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేపు జరుగనున్న సంగతి తెలిసిందే. లండన్ లోని ఓవల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. భారత్ కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 నిమిషాలకి జరుగనుంది. స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రస్తుతం ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారత్ కి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వరుసగా రెండోది కాగా.. ఆసీస్ కి మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ ట్రోఫీ సాధించని రెండు జట్లు ఈ మ్యాచులో ఎవరు గెలిచినా క్రికెట్ చరిత్రలో అన్ని ఐసీసీ టైటిల్స్ నెగ్గిన జట్టుగా అవతరిస్తుంది. ఈ సమయంలో రోహిత్ కి గాయం తీవ్రత ఎలా ఉందో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది . ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెప్పండి.