న్యూజిలాండ్ తో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిపోయారు. మ్యాచ్ ప్రారంభం నుంచే కివీస్ బౌలర్లపై ఆధిపత్యాన్ని చెలాయించారు గిల్-రోహిత్. ఇక మూడు సంవత్సరాలుగా సెంచరీ కోసం నిరీక్షిస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తన శతక దాహాన్ని ఈ మ్యాచ్ తీర్చుకున్నాడు. ఈ వన్డేలో 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్ లతో 101 పరుగులతో చెలరేగాడు. దాంతో వన్డేలో 30 సెంచరీల మార్క్ ను అందుకున్నాడు. 2020 జనవరి 19న తన చివరి వన్డే సాధించిన హిట్ మ్యాన్ ఆ తర్వాత సెంచరీ సాధించడానికి ఇబ్బందులు పడ్డాడు. ఈ శతకంతో ఆసిస్ దిగ్గజం రికీ పాంటింగ్ సరసన చోటుదక్కించుకున్నాడు రోహిత్.
రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక టీమిండియాను తన సారథ్యంలో వన్డేల్లో అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. తాజాగా కివీస్ తో జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో రోహిత్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మూడు సంవత్సరాల సుదీర్ఘకాల శతక నిరీక్షణకు తెరదించాడు హిట్ మ్యాన్. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్ లతో 101 పరుగులు చేశాడు రోహిత్. దాంతో తన కెరీర్ లో 30వ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ఆసిస్ దిగ్గజ బ్యాటర్ అయిన రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు రోహిత్.
Rohit Sharma level Ricky Ponting in ODI Centuries. 30 Century today against NZ.
📷 : BCCI & ICC#RohitSharma #ODICricket #Cricket#ODICentury #FantasyPredictionForFree pic.twitter.com/YNMrD25Le8
— Fantasy Prediction For Free (@fp4f_family) January 24, 2023
ఈ క్రమంలోనే అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో 30 సెంచరీలతో పాంటింగ్ తో కలిసి మూడో స్థానంలో సమంగా నిలిచాడు హిట్ మ్యాన్. పాంటింగ్ 365 వన్డేల్లో 30 శతకాలు కొడితే.. రోహిత్ కేవలం 234 వన్డేల్లోనే ఈ ఘనతను సాధించాడు. ఇక అగ్రస్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ 452 ఇన్నింగ్స్ ల్లో 49 సెంచరీలతో ఉన్నాడు. తర్వాత టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 262 ఇన్నింగ్స్ ల్లోనే 46 శతకాలు బాది సచిన్ వెన్నంటే ఉన్నాడు. మరి రోహిత్ శర్మ పాంటింగ్ రికార్డును సమం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#RohitSharma𓃵 #BCCI #INDvsNZ @ImRo45 #RickyPonting @RickyPonting
Indian skipper Rohit Sharma equals Ricky Ponting’s record of most hundred in ODIs. pic.twitter.com/CMKjnJCgdT
— Rajat Verma (@writer_rajat) January 24, 2023