ఆర్సీబీ తరఫున ఈసారి క్లాస్ అండ్ కూల్ బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ.. సన్ రైజర్స్ చేసిన సెంచరీతో సరికొత్త రికార్డు సాధించాడు. ఆ లిస్టులో ఏకంగా టాప్ లోకి వెళ్లిపోయాడు.
ప్రస్తుత క్రికెట్లో సచిన్ 100 సెంచరీల రికార్డ్ ను ఎవరు బద్దలు కొడతారు? ఇక ఈ ప్రశ్నకు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సమాధానం చెప్తూ.. ఆ ఆటగాడే సచిన్ రికార్డును బద్దలు కొడతాడని, ఏకంగా 110 సెంచరీలు చేస్తాడని జోస్యం చెప్పాడు.
యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్.. కొన్నిరోజుల ముందు ఈ పేరు గట్టిగా వినిపించింది. అందుకు కారణం వన్డేల్లో డబుల్ సెంచరీ. చాలా చిన్న ఏజ్ లోనే ఈ ఫీట్ సాధించేసరికి అందరూ మనోడి గురించి తెగ మాట్లాడుకున్నారు. మనోడి బ్యాటింగ్ పై డౌట్స్ ఉన్నవాళ్లందరికీ తన ద్విశతకంతో అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. అది జరిగి కొన్నిరోజులైనా కాలేదు. అప్పుడే టీ20ల్లో తొలి శతకం బాదేశాడు. క్లాస్ గా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించాడు కానీ అంతే స్మూత్ […]
న్యూజిలాండ్ తో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిపోయారు. మ్యాచ్ ప్రారంభం నుంచే కివీస్ బౌలర్లపై ఆధిపత్యాన్ని చెలాయించారు గిల్-రోహిత్. ఇక మూడు సంవత్సరాలుగా సెంచరీ కోసం నిరీక్షిస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తన శతక దాహాన్ని ఈ మ్యాచ్ తీర్చుకున్నాడు. ఈ వన్డేలో 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్ లతో 101 పరుగులతో చెలరేగాడు. దాంతో వన్డేలో 30 సెంచరీల మార్క్ ను అందుకున్నాడు. 2020 జనవరి 19న […]
క్రికెట్ చరిత్రలో కొన్ని అసాధారణ రికార్డులు నెలకొల్పడం అనేది సాధారణ విషయం కాదు. అలాంటి అసాధారణ రికార్డును తాజాగా పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో సాధించాడు న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే. క్రికెట్ చరిత్రలో మరే ఇతర ఆటగాడు సాధించని అరుదైన రికార్డును నెలకొల్పాడు ఈ కివీస్ బ్యాటర్. ఇప్పటికే ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవంతో కుమిలిపోతున్నపాక్ జట్టును కివీస్ సైతం ఓ ఆటఆడుకుంటోంది. తొలి టెస్ట్ ను చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు.. […]
క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ అంటారు. ప్రపంచంలో ఏదో ఒకమూలన దాదాపు ప్రతిరోజు ఏదో ఒకరికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. వాటిని మరికొందరు ఆటగాళ్లు బద్దలు కొట్టడమో,సమయం చేయడమో జరుగుతుంది. అయితే ప్రపంచ క్రికెట్ లో చాలా మంది ఆటగాళ్లు సాధించిన రికార్డు లు ఒక ఎత్తు అయితే.. ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ సాధించిన రికార్డులు మరోక ఎత్తనే చెప్పాలి. ఇప్పటి వరకు చాలా రికార్డులు డాన్ బ్రాడ్ మన్ పేరిటే ఉన్నాయి. […]