ఆర్సీబీ తరఫున ఈసారి క్లాస్ అండ్ కూల్ బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ.. సన్ రైజర్స్ చేసిన సెంచరీతో సరికొత్త రికార్డు సాధించాడు. ఆ లిస్టులో ఏకంగా టాప్ లోకి వెళ్లిపోయాడు.
విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే మనకు అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు ఎవరికీ సాధ్యం కానీ విధంగా నెలకొల్పిన రికార్డులే గుర్తొస్తాయి. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ప్రతిదానిలోనూ అరుదైన ఘనతల్ని సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లీ.. తాజాగా సన్ రైజర్స్ తో కీలక మ్యాచ్ లో దుమ్మురేపాడు. సెంచరీ చేసి శెభాష్ అనిపించాడు. ఈ మ్యాచ్ లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే టైంలో కోహ్లీ సరికొత్త రికార్డుల్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయమే ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2019 తర్వాత కోహ్లీకి మూడేళ్లపాటు అంటే 2022 సగం వరకు బ్యాడ్ టైమ్ నడిచింది. ఆ టోర్నీలో సెంచరీ చేసి కమ్ బ్యాక్ ఇచ్చిన కోహ్లీ.. ఆ తర్వాత అంటే రీసెంట్ టైంలో వన్డే, టెస్టుల్లోనూ శతకాలు కొట్టి, తనపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ సన్ రైజర్స్ తో మ్యాచ్ లో సెంచరీ కొట్టి, తన స్టామినా ఇంకా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు. ఈ మ్యాచ్ లో తొలుత హైదరాబాద్ 186/5 స్కోరు చేయగా.. ఆర్సీబీ 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన కోహ్లీ.. ఐపీఎల్ లో ఎక్కువ సెంచరీలు చేసిన ప్లేయర్ గా సరికొత్త రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం గేల్ ఆరు సెంచరీలతో ఉండగా, కోహ్లీ అతడిని సమం చేశాడు. ఓవరాల్ టీ20 క్రికెట్ లోనూ 7 సెంచరీలతో.. టీమిండియా తరఫున అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా టాప్ లోకి వెళ్లిపోయాడు. తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 6 సెంచరీలతో ఉన్నారు. ఇలా అందరూ కోహ్లీ పని అయిపోయిందనుకున్న టైంలో వేరే లెవల్ కమ్ బ్యాక్ ఇస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో ఈ సారి స్వదేశంలో జరగబోయే వరల్డ్ కప్ లోనూ కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీల వర్షం గ్యారంటీ అనిపిస్తుంది. సరే ఐపీఎల్, టీ20ల్లో కోహ్లీ సరికొత్త రికార్డులు సెట్ చేయడంపై మీరేం అంటారు? కింద కామెంట్ చేయండి.