క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ అంటారు. ప్రపంచంలో ఏదో ఒకమూలన దాదాపు ప్రతిరోజు ఏదో ఒకరికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. వాటిని మరికొందరు ఆటగాళ్లు బద్దలు కొట్టడమో,సమయం చేయడమో జరుగుతుంది. అయితే ప్రపంచ క్రికెట్ లో చాలా మంది ఆటగాళ్లు సాధించిన రికార్డు లు ఒక ఎత్తు అయితే.. ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ సాధించిన రికార్డులు మరోక ఎత్తనే చెప్పాలి. ఇప్పటి వరకు చాలా రికార్డులు డాన్ బ్రాడ్ మన్ పేరిటే ఉన్నాయి. ఇక తాజాగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో ఆసిస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్మిత్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ రికార్డు ను సమం చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
డాన్ బ్రాడ్ మన్.. క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా వెలుగొందుతున్నాడు. ఇక రోజులు గడుస్తున్న కొద్ది అతడి రికార్డులు బద్దలు అవుతూనే ఉన్నాయి. తాజాగా బ్రాడ్ మన్ రికార్డును సమం చేశాడు ఆసిస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో చెలరేగి ఆడి డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ద్విశతకంతో దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్ మన్ రికార్డును సమం చేశాడు స్మిత్. 29 సెంచరీలు బాది డాన్ బ్రాడ్ మన్ రికార్డును సమం చేశాడు స్మిత్. 88 టెస్టు మ్యాచ్ లు ఆడిన స్మిత్ 29 శతకాలు బాదాడు.
ఇక బ్రాడ్ మన్ కు 29 సెంచరీలు కొట్టడానికి కేవలం 52 మ్యాచ్ లే పట్టాయి. ఈ రికార్డుతో పాటుగా స్మిత్.. ఆసిస్ తరపున టెస్టుల్లో ఎక్కువ శతకాలు సాధించిన నాలుగో బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. ఇతడి కంటే ముందు రికీ పాంటింగ్ (41), స్టీవ్ వా(32), హెడెన్(30) సెంచరీలతో స్మిత్ కంటే ముందున్నారు. ఇక ఓవర్ ఆల్ గా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో 14వ స్థానంలో ఉన్నాడు స్మిత్. ఇక ఈ మ్యాచ్ లో స్మిత్ (200), లబూషేన్ (204), హెడ్ (99) పరుగులతో రాణించారు. దాంతో ఆసిస్ 598/4 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది.
29 x 💯
Steve Smith showing no signs of slowing down! #MilestoneMoments#AUSvWI | @nrmainsurance pic.twitter.com/ebkgO2j8n5
— cricket.com.au (@cricketcomau) December 1, 2022
Australia declare their innings after posting a mammoth total of 598 runs in the 1st Innings against West Indies.#Australia #WestIndies #SteveSmith #AUSvsWI #TestCricket #CricTracker pic.twitter.com/oE7ETLNEGp
— CricTracker (@Cricketracker) December 1, 2022