క్రికెట్ చరిత్రలో కొన్ని అసాధారణ రికార్డులు నెలకొల్పడం అనేది సాధారణ విషయం కాదు. అలాంటి అసాధారణ రికార్డును తాజాగా పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో సాధించాడు న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే. క్రికెట్ చరిత్రలో మరే ఇతర ఆటగాడు సాధించని అరుదైన రికార్డును నెలకొల్పాడు ఈ కివీస్ బ్యాటర్. ఇప్పటికే ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవంతో కుమిలిపోతున్నపాక్ జట్టును కివీస్ సైతం ఓ ఆటఆడుకుంటోంది. తొలి టెస్ట్ ను చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు.. వెలుతురు సరిగా లేనికారణంగా డ్రా చేసుకుంది పాకిస్థాన్. ఇక కరాచీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో డెవాన్ కాన్వే చరిత్ర సృష్టించాడు.
పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజే సెంచరీతో చెలరేగాడు కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే. 191 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్స్ తో 122 పరుగులు చేశాడు కాన్వే. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలి సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే? గత ఏడాది కూడా తొలి సెంచరీ నమోదు చేసిన బ్యాటర్ కూడా కాన్వేనే కావడం. 2022 జనవరిలో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ లో కూడా కాన్వే 227 బంతులు ఎదుర్కొని 122 పరుగులు చేయడం గమనార్హం. దాంతో వరుసగా తొలి శతకాలు సాధించిన తొలి ఆటగాడిగా క్రికెట్ లో అరుదైన ఘనత నెలకొల్పాడు కాన్వే. కాన్వే సెంచరీతో చెలరేగడంతో తొలిరోజు కివీస్ 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.
Big wicket for Pakistan!
Centurion Devon Conway departs after a fine hundred.#CricTracker #DevonConway #PAKvNZ pic.twitter.com/Wk4HQKPgrL
— CricTracker (@Cricketracker) January 2, 2023
కాన్వేకి తోడుగా మరో ఓపెనర్ టామ్ లాథమ్ 71 పరుగులతో సత్తా చాటాడు. మిగిలిన బ్యాటర్లలో తొలి మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన విలియమ్సన్ 36 పరుగులకే అవుట్ కాగా.. నికోల్స్(26) విఫలం అయ్యాడు. ఇక పాకిస్థాన్ బౌలర్లలో అఘా సల్మాన్ మూడు వికెట్లు తీయగా.. నసీమ్ షా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక తొలి టెస్ట్ లో సైతం కాన్వే 92 పరుగులు చేసి సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ బ్యాటర్లు.. పాకిస్థాన్ బౌలింగ్ ను ఎదుర్కొలేక పోయారు. పాక్ బౌలర్లు చెలరేగడంతో ప్రస్తుతం సమాచారం అందే నాటికి న్యూజిలాండ్ 9 వికెట్లకు 366 పరుగులు చేసింది. క్రీజ్ లో మ్యాట్ హెన్రీ (25), అజాజ్ పటేల్(0) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
Devon Conway – First Centurion in 2022 ✅
Devon Conway – First Centurion in 2023 ✅#DevonConway | #PAKvNZ pic.twitter.com/GPg9rqkaYI— CricTracker (@Cricketracker) January 2, 2023