టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప రెచ్చిపోయి ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఊతప్ప.. ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పి.. విదేశీ లీగ్‌లలో సత్తా చాటుతున్నాడు. యూఏఈ వేదికగా కొత్తగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున ఆడున్నాడు. సోమవారం గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊతప్ప విధ్వంసం సృష్టించాడు. గల్ఫ్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఫోర్లు, సిక్సులు అలవోకగా బాదేశాడు. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ కంటే ముందు నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ 43 పరుగులతో రాణించాడు. ఈ లీగ్‌లో ఊతప్ప ఆడుతున్న స్టైల్ చూస్తుంటే.. వింటేజ్ ఊతప్పను చూసినట్లే ఉంది. ఐపీఎల్‌లో కూడా ఇంకా ఆడే సత్తా ఉన్నా.. యువ క్రికెటర్లతో పోటీ నేపథ్యంలో ఊతప్ప ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు.
కాగా.. సోమవారం మ్యాచ్‌లో మొత్తం 46 మొత్తం 10 ఫోర్లు, 2 సిక్సులతో 79 పరుగులు చేశాడు. ఊతప్ప చెలరేగి ఆడటంతో క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఊతప్పతో పాటు క్యాపిటల్స్ కెప్టెన్ పావెల్ 25 బంతుల్లో 38, సికందర్ రజా 19 బంతుల్లో 30 పరుగులు చేసి రాణించడంతో క్యాపిటల్స్‌కు మంచి స్కోర్ వచ్చింది. అయితే.. గల్ఫ్ జెయింట్స్ బ్యాటర్లు సైతం చెలరేగడంతో.. 183 పరుగుల టార్గెట్‌ను 19 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గల్ఫ్ ఓపెనర్ జేమ్స్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 83 పరుగులు చేసి రాణించాడు. అతనితో పాటు గెర్హార్డ్ ఎరాస్మస్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 52 పరుగులు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఊతప్ప పోరాటం వృథా అవుతూ.. దుబాయ్ క్యాపిటల్స్‌పై గల్ఫ్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2006లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఊతప్ప.. అనతి కాలంలోనే ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమిండియా గెలిచిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007 టీమ్‌లోనూ ఊతప్ప కీ ప్లేయర్‌గా ఉన్నాడు. బ్యాటింగ్ చేస్తూ.. పేస్ బౌలింగ్‌లో సైతం నడుచుకుంటూ ముందుకు వచ్చి షాట్లు ఆడటం ఊతప్ప ప్రత్యేకత. ఇక టీమిండియా తరఫున 46 వన్డేలు ఆడిన ఊతప్ప 934 పరుగులు చేశాడు. 13 టీ20లు ఆడి 249 రన్స్ చేశాడు. వైట్ బాల్‌లో రాణించిన ఊతప్పకు టెస్టు క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్‌లో కూడా ఊతప్పకు మంచి రికార్డులే ఉన్నాయి. ఒక సీజన్‌లో టాప్‌స్కోరర్‌గా కూడా నిలిచాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. మరి యూఏఈ లీగ్‌లో ఊతప్ప ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Robin Uthappa with the green belt for the highest run-getter in ILT20. pic.twitter.com/lselxTqp9A
— Johns. (@CricCrazyJohns) January 16, 2023
26 ball fifty for Robin Uthappa in ILT20, he has been in brilliant form in UAE. pic.twitter.com/TWewW0yDpT
— Johns. (@CricCrazyJohns) January 16, 2023