టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా మంటల్లో కాలిబూడిదైంది. ప్రమాదం జరగ్గానే పంత్ కారు అద్దాలను బ్రేక్ చేసుకుని బయటపడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యాక్సిడెంట్ లో గాయపడ్డ పంత్ ను స్థానికుల సహాయంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాల పాలైన పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా పంత్ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫుటేజీ నెట్టింట వైరల్ గా మారింది.
రిషబ్ పంత్.. తన తల్లితో కలిసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని తన స్వస్థలానికి బయలుదేరాడు. కుటుంబ సభ్యులకు సమాచార ఇవ్వకుండా సర్ప్రైజ్ చేద్దామని పంత్ వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పంత్ కారు శుక్రవారం తెల్లవారు జామున 5.30 గంటలకు యక్సిడెంట్ కు గురైంది. రొడ్డుపక్కన ఉండే రైలింగ్ ను ఢీకొంది కారు. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ పంత్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకి వచ్చింది. ఈ వీడియోలో పంత్ కారు వేగంగా వచ్చి రోడ్డు సైడ్ కు ఉండే రైలింగ్ ను ఢీ కొంటూ వెళ్లిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఆ వీడియోను చూస్తే హాలీవుడ్ రేంజ్ లో యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
CCTV footage from accident site..
Praying for speedy recovery #RishabhPant pic.twitter.com/e8B1MvLuX3
— Aman Tiwari (@amantiwari_) December 30, 2022
This video is told to be of Rishabh Pant’s recent accident in Uttarakhand. Vehicle can be seen on fire and Pant is lying on the ground. @TheLallantop pic.twitter.com/mK8QbD2EIq
— Siddhant Mohan (@Siddhantmt) December 30, 2022