టీమిండియా యంగ్ గన్ రిషభ్ పంత్ భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్ధలు కొట్టాడు. ధోని స్థానంలో టీమిండియాలోకి వచ్చిన పంత్.. అద్భుతమైన ఆటతో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. తన ఎటాకింగ్ బ్యాటింగ్‌తో టీమిండియాకు ఒంటి చేత్తో విజయాలు అందిస్తున్న పంత్.. తాజాగా ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు. 2020 నుంచి టీమిండియా తరపున అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. అప్పటి నుంచి పంత్ అన్ని ఫార్మాట్లు కలిపి ఏకంగా 48 సిక్సులు కొట్టాడు. దీంతో 40 సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ రికార్డును అధిగమించాడు. పంత్, రోహిత్ తర్వాత కేఎల్ రాహుల్ 21 సిక్సులతో మూడో స్థానంలో ఉన్నాడు.
కాగా శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో పంత్ సూపర్ బ్యాటింగ్‌తో 97 బంతుల్లో 96 పరుగులు చేశాడు. కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ప్రస్తుతం భారత్ జట్టులో అన్ని ఫార్మాట్లలో రెగ్యూలర్ ప్లేయర్‌గా ఉన్న పంత్.. ఈ రికార్డును చాలా కాలం తన ఖాతాలోనే ఉంచుకునే అవకాశం ఉంది. అలాగే రోహిత్ శర్మ శ్రీలంకతో రెండో టెస్టులో విజృంభిస్తే మళ్లీ తానే అగ్రస్థానం అధిరోమిస్తాడు. కాగా కొన్ని రోజుల వరకైతే ఈ రికార్డు ఈ ఇద్దరి మధ్యే తిరిగే అవకాశం ఉంది. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Sayyad Nag Pasha (@PashaNag) March 7, 2022