టీమిండియా వికెట్ కీపర్ అనే ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ పేరే. కెప్టెన్ గా సరికొత్త రికార్డ్స్ ఎలా క్రియేట్ చేశాడో.. కీపర్ గా ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసి పెట్టాడు. ఇక ప్రస్తుతం పంత్ కీపర్ గా ఉన్నాడు గానీ ధోనీ స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు. గత కొన్నాళ్ల నుంచైతే బ్యాటర్ గా ఓ మాదిరిగా మాత్రమే ఫెర్ఫార్మ్ చేస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓ విషయంలో మాత్రం ధోనీని గుర్తు చేశాడు. దీనిపై దినేశ్ కార్తిక్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చట్టోగ్రామ్ వేదికగా టీమిండియా-బంగ్లాదేశ్ తొలి టెస్టు ఆడాయి. ఈ మ్యాచ్ లో మన జట్టు విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేసిన భారత్.. బంగ్లాను 150 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో 258/2 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో 512 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఇక టార్గెట్ ఫినిష్ చేసే క్రమంలోనే బంగ్లాదేశ్ 324 రన్స్ దగ్గర ఆలౌటైంది. దీంతో భారత్, 188 పరుగుల తేడాతో తొలి టెస్టులో విజయం సాధించింది. 1-0తో ఈ సిరీస్ లో ఆధిక్యంలోనూ నిలిచింది.
‘బంగ్లాదేశ్ తో టెస్టులో పంత్ అద్భుతమైన కీపింగ్ టెక్నిక్స్ చూపించాడు. ధోనీని పంత్ ఆరాధిస్తాడని భావిస్తున్నాను. ఇప్పుడు బంగ్లాదేశ్ పై తొలి టెస్టులో పంత్ చేసిన స్టంపింగ్ చూస్తే ధోనీ గర్వంగా ఫీలై ఉంటాడు. పిచ్ మీద బంతి చాలా వేగంగా కీపర్ వైపు వచ్చింది. అయినా సరే పంత్ అద్భుతంగా పట్టుకుని స్టంప్ చేశాడు. ధోనీ కూడా ఇలా అద్భుతంగా స్టంపౌట్స్ చేసేవాడు. బ్యాటర్ ని ముందే అంచనా వేసి వికెట్లని పడగొట్టేందుకు ధోనీ సిద్ధంగా ఉంటాడు’ అని సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. మరి పంత్ ని ధోనీతో కంపేర్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
चीते की चाल, बाज़ की नज़र और ऋषभ पंत के स्टंपिंग पर संदेह नहीं करते.#BANvIND #BANvsIND #INDvsBAN #Rishabpantpic.twitter.com/5uDlYUxHAZ
— 𝐎𝐧𝐞𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭 हिन्दी (@OneCricketHindi) December 17, 2022