న్యూ ఇయర్ వేడుకలను తన కుటుంబంతో కలిసి చేసుకోవడానికి వెళ్తున్న క్రమంలో.. డిసెంబర్ 30న టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇక అతడికి కొన్ని రోజులు డెహ్రడూన్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం పంత్ ను మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించింది బీసీసీఐ. ప్రస్తుతం పంత్ ముంబై లోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి మరో ఆపరేషన్ చేశారు వైద్యులు. ఇప్పటికే రూర్కీలోని ఆస్పత్రిలో మెుహానికి ప్లాస్టిక్ సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. మరిన్ని వివరాల్లోకి వెళితే..
కారు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్ పంత్.. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే మెరుగైన చికిత్స కోసం పంత్ ను ముంబైకి తరలించింది బీసీసీఐ. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ లో ప్రస్తుతం పంత్ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే డాక్టర్. దిన్షావ్ పర్డివాలా పర్యవేక్షణలో శుక్రవారం పంత్ కు విజయవంతంగా సర్జరీ నిర్వహించింది వైద్యుల బృందం. అతడి మోకాలికి దిగ్విజయంగా సర్జరీని చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సైన్స్ అండ్ మెడిసిన్ విభాగం ప్రముఖ వార్త సంస్థ పీటీఐకి తెలిపింది. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం బాగుందని వైద్యుల బృందం తెలిపింది. ప్రస్తుతం అతడిని పర్యవేక్షణలో ఉంచామని డాక్టర్లు తెలిపారు. కారు ప్రమాదంలో పంత్ అయిన గాయాలకు ఒక్కొక్క దానికి సర్జరీలు చేసుకుంటు వస్తున్నారు వైద్యులు. అయితే పంత్ కూర్చునే పరిస్థితిలో లేనందున అతడిని డెహ్రాడూన్ నుంచి ఎయిర్ ఆంబులెన్స్ లో ముంబైకి తరలించారు. ప్రస్తుతం పంత్ సర్జరీ సక్సెస్ కావడం, అతడు కోలుకుంటున్నాడు అన్న వార్త తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
The surgery for the knee ligament of Rishabh Pant is successful, he is doing fine. (Source – PTI)
— Johns. (@CricCrazyJohns) January 7, 2023