ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోసం ఎంతో మంది ప్రతిభావంతమైన క్రికెటర్లు పోటీ పడుతున్నారు. కానీ అందులో కొందరికి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు వచ్చినా గానీ ఉపయోగించుకోలేని ఆటగాళ్లు మరికొందరు. అందులో యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ ఒకడు. అతడు కంటీన్యూస్ గా విఫలం అవుతున్నప్పటికీ టీ20ల్లో అవకాశాలు ఇచ్చారు. అయితే టీ20ల్లో విఫలం అయిన పంత్.. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. లంచ్ సమయానికి 29 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే తన అంతర్జాతీయ కెరీర్ లో 4000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు పంత్. అదీకాక టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ గా 50 సిక్స్ లు కొట్టిన ఇండియాన్ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు.
రిషభ్ పంత్.. గత కొంత కాలంగా వరుస అవకాశాలు వస్తున్నా గానీ విఫలం అవుతూ.. విమర్శల పాలైయ్యాడు. దాంతో జట్టులో అతడి స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కు ఎంపికైయ్యాడు పంత్. ఇక ఈ మ్యాచ్ లో బంగ్లా బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. 48 పరుగులకే కెప్టెన్ కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీలు వెనుదిరిగారు. మెుదటి నుంచి నెమ్మదిగా ఆడిన కేఎల్ రాహుల్.. ఖలీద్ అహ్మద్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇక శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీలను తజుల్ ఇస్లామ్ బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
అనంతరం క్రీజ్ లోకి వచ్చిన పంత్ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 4 ఫోర్లు, 2 సిక్స్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 111 స్ట్రైక్ రేట్ తో పంత్ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటేనే అర్ధం చేసుకోవచ్చు.. అతడు ఎలా ఆడుతున్నాడో. ఇక పంత్ కు టీ20లు అయినా, టెస్టులు అయినా ఒకటే అని మనకు తెలిసిందే. ప్రస్తుతం వైస్ కెప్టెన్ చతేశ్వర్ పుజారా 22 రన్స్ తో, రిషభ్ పంత్ 6ఫోర్లు, 2 సిక్స్ తో 46 పరుగుల వద్ద హసన్ మిర్జా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 32 ఓవర్లలో 116/4 గా నమోదు అయ్యింది. పంత్ ఇలాగే అగ్రెసివ్ గా ఆడితే తొలి రోజే భారత్ భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయని క్రీడా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Rishabh Pant is the fastest to complete 50 sixes by an Indian in Test cricket history.
— Johns. (@CricCrazyJohns) December 14, 2022
.@RishabhPant17 breaches the 4000-run mark in international cricket 👏👏#TeamIndia #BANvIND pic.twitter.com/zRxRG96UrH
— BCCI (@BCCI) December 14, 2022
Lunch on Day 1 of the 1st Test.#TeamIndia lose three wickets in the morning session with 85 runs on the board.
Scorecard – https://t.co/CVZ44NpS5m #BANvIND pic.twitter.com/iiYYlbpnQi
— BCCI (@BCCI) December 14, 2022