రికీ పాంటింగ్ కూతురి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి పంత్ చేసిన కామెంట్‌పై నెటిజన్లు సైటర్లు వేస్తున్నారు. పాంటింగ్ కూడా పంత్ కామెంట్‌కు ఎలాంటి రిప్లే ఇవ్వలేదు. ఇంతకీ పంత్ ఏం అన్నాడని అనుకుంటున్నారా? అయితే చదవండి.. ‘నేను ఒక టీనేజర్ ఆడపిల్లకు తండ్రినన్న విషయాన్ని నమ్మలేక పోతున్న’ అంటూ తన కూతురికి బర్డ్‌డే విషెష్ చెప్పాడు పాంటింగ్.
రికీ పోస్టుకు పంత్ కామెంట్ పెడుతూ.. ‘నువ్వు ముసలివాడివి అవుతున్నావు అన్న విషయాన్ని మేము నమ్ముతున్నాం లే రికీ, హ్యాపీ బర్త్‌డే’ అని అన్నాడు. దీనికి పాంటింగ్ స్పందించలేదు. పంత్ సరదాగా అన్న కూడా అది పాంటింగ్ నచ్చలేదేమో అని నెటిజన్లు భావిస్తున్నారు. పంత్ కూడా ఏ సందర్భంలో ఏం మాట్లాడుతాడో తెలియదంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రికీ పాంటింగ్ హెడ్ కోచ్, పంత్ కెప్టెన్. ఇద్దరి మధ్య మంచి స్నేహ వాతావరణమే ఉంటుంది.