సాధారణంగా క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు కామెంటేటర్లుగా చేస్తుంటారు. ప్రస్తుతం ఆసిస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ సైతం కామెంటేటర్ గా సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు కామెంటరీ చేస్తున్న క్రమంలో రికీ పాంటింగ్ కు గుండె నొప్పి వచ్చింది. దాంతో రికీని హుటాహుటిన సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు అక్కడి క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
పాంటింగ్.. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్ గా తన సేవలను కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగా స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ మూడో రోజులో కామెంటరీ చేస్తుండగా పాంటింగ్ కు గుండెల్లో నొప్పి వచ్చింది. దాంతో అతడిని హుటాహుటిన పెర్త్ లోని సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
Ricky Ponting rushed to hospital after health scare during day three of first Test
MORE: https://t.co/UrIQobb62u pic.twitter.com/SRkDYEpjtg
— Fox Cricket (@FoxCricket) December 2, 2022
రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రంలో ఓ అధ్యాయమనే చెప్పాలి. 20 ఏళ్ల వయస్సులో ఆస్ట్రేలియా జట్టులోకి ఇచ్చిన ఎంట్రీ ఇచ్చిన పాంటింగ్ శ్రీలంక(1995)తో జరిగిన తొలి మ్యాచులోనే 96 పరుగులు చేశాడు. అలా నిలకడగా రాణిస్తూనే.. స్టీవ్ వా తరువాత జట్టు పగ్గాలు చేపట్టాడు. ఆ తరువాత అతని సారధ్యంలోని ఆస్ట్రేలియా జట్టు.. దశాబ్ధం పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిందని చెప్పాలి. 2003, 2007 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో విశ్వవిజేతగా నిలిపాడు. వాస్తవంగా చెప్పాలంటే.. 2003 వన్డే వరల్డ్ కప్ ను భారత్ కు దూరం చేసింది పాంటింగ్ అనే చెప్పాలి. ఆ మ్యాచులో పాంటింగ్ 138 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 140 పరుగులు చేస్తాడు. దీంతో ఆసీస్.. భారత జట్టు ముందు 360 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశిస్తుంది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత జట్టు 234 పరుగులకే ఆలౌట్ అయ్యి.. 125 పరుగుల తేడాతో ఓటమి పాలవుతోంది. ఈ ఒక్క మ్యాచే కాదు.. పాంటింగ్ కెరీర్ లో ఇలాంటి మ్యాచులు ఎన్నో ఉన్నాయి.
#OnThisDay Relive Ricky Ponting’s brilliant 140* from 121 balls against India, which led Australia to World Cup glory in 2003. 🏆
WATCH ⬇️ pic.twitter.com/qcpVxU2mWj
— ICC (@ICC) March 23, 2018
ఇక పాంటింగ్ తన క్రికెట్ కెరీర్ లో మొత్తం.. 168 టెస్టులు ఆడి 13378 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు, 62 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల విషయానికొస్తే.. 375 మ్యాచుల్లో 13704 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 82 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20 మ్యాచుల విషయానికొస్తే.. 17 మ్యాచుల్లో 401 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. పాంటింగ్ బౌలర్ గా రాణించిన సందర్భాలు ఉన్నాయి. టెస్టుల్లో 5, వన్డేల్లో 3 వికెట్లు పడగొట్టాడు. పాంటింగ్ రిటైర్మెంట్ ప్రతికటించాక.. ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ కోచ్ గా కూడా పనిచేశారు. అలాంటి గొప్ప క్రికెటర్ మరలా.. మనముందు కలియతిరగాలని మనమూ ఆశిద్దాం..