ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడల్లో క్రికెట్ ముందువరుసలో ఉంది. ఇక ఇండియాలో క్రికెట్ ను ఓ మతంలా చూస్తారని ప్రేత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి ఆటగాళ్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు, వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు క్రికెట్ లో లేవనెత్తని ప్రశ్నను లేవనెత్తాడు కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింస. ఇండియన్ క్రికెట్ లో రిజర్వేషన్లు తీసుకురావాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన వారందరు అగ్రకులాలకు చెందిన వారే అని విమర్శించాడు. ఇకనైనా ఈ విధానానికి స్వస్తి పలకాలని సూచించాడు.
చేతన్ కుమార్ అహింస.. ప్రముఖ కన్నడ నటుడు. నటనతో పాటుగా సమాజంలో నెలకొన్న సమస్యలపై తనదైన రీతిలో ఉద్యమిస్తుంటాడు. దాంతో కన్నడలో ప్రముక సోషియల్ యాక్టివిస్టుగా పేరొందాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే ప్రజా సమస్యలపై తగ గళాన్ని లేవదీస్తుంటాడు. ఈ క్రమంలోనే మరో సంచలన విషయానికి కేంద్రబిందువయ్యడు చేతన్ కుమార్. క్రికెట్ ను మతంలా భావిస్తున్న భారతదేశంలో.. ఇండియన్ క్రికెట్ టీమ్ లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చేతన్ కుమార్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం టీమిండియాలో ఆడుతున్న ఆటగాళ్లు అంతా అగ్రకులాలకు చెందినవారే. ఈ విషయం మనందరికి తెలుసు. అదీకాక క్రికెటర్లకు లభించే డబ్బు, పేరు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే టీమిండియా గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే జట్టు ఎంపికల్లో రిజర్వేషన్లు ఉండాలి” అంటూ ట్విట్ చేశాడు.
అగ్ర కులాలతో పాటుగా కింది స్థాయి కులానికి సంబంధించిన ఆటగాళ్లకు కూడా జట్టులో చోటు కల్పించాలని చేతన్ అహింస డిమాండ్ చేశాడు. దీనికి ఉదాహరణగా సౌతాఫ్రికా జట్టును చూపించాడు. సౌతాఫ్రికా జట్టులో 2016 నుంచి జట్టులో కనీసం ఆరుగురు నల్లజాతీయులను జట్టులోకి తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశాడు చేతన్ కుమార్. ప్రస్తుతం చేతన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇటు క్రీడా వర్గాల్లోనే కాక అటు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. అయితే దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు సగటు క్రీడాభిమానులు. క్రికెట్ లో రాణించిన ఆటగాళ్లకే జట్టులో అవకాశాలు ఉంటాయి. అలా కాక రిజర్వేషన్లు తీసుకొస్తే నైపుణ్యం గల ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
क्या है आप की राय ?
दक्षिण अफ्रीका की तरह भारतीय क्रिकेट टीम में भी आरक्षण लागू होना चाहिए ताकि टीम बेहतर प्रदर्शन कर सके।
– मशहूर कन्नड़ अभिनेता चेतन अहिम्सा@ChetanAhimsa pic.twitter.com/Ycw8iyLnvA
— The Mooknayak (@The_Mooknayak) December 5, 2022