Kohli: ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం అయిపోయాయి. గుజరాత్, రాజస్థాన్, లక్నో జట్లు ముందే ప్లే ఆఫ్స్ బెర్తులు రిజర్వ్ చేసుకోగా.., ఢిల్లీపై ముంబై విజయంతో బెంగుళూరు టీమ్ ప్లే ఆఫ్స్ లోకి ఎంటర్ అయ్యింది. కోహ్లీ ఫ్యాన్స్ కి, ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తున్న విషయం. ఇక.. ఈసారి ఆర్సీబి కప్ కొడితే మాత్రం ఫ్యాన్స్ కి 14 ఏళ్ళ కల తీరినట్టే. కానీ.., బెంగుళూరు విజేతగా నిలిస్తే మాత్రం అది కోహ్లీకి శాపంగా మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ 2011 నుండి 2021 వరకు బెంగుళూరు టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. కానీ.., ఈ 10 ఏళ్ళ కాలంలో ఒక్కసారి కూడా ఆ జట్టు విజేతగా నిలవలేకపోయింది. కొన్ని సీజన్స్ లో అయితే ప్లే ఆప్స్ కి కూడా చేరలేక.. పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే.., ఈ 10 ఏళ్ల కాలంలో ఆటగాడిగా మాత్రం కోహ్లీ ఆర్సీబీ జట్టు కోసం ఎంతో చేశాడు. ఎన్నో రికార్డ్స్ నెలకొల్పాడు. టీమిండియాకి ఆడే సమయంలో కోహ్లీ ఎంతటి నిబద్దత చూపిస్తాడో, ఆర్సీబి తరుపున ఆడే సమయంలో కూడా అంతే నిబద్దతో ఉంటాడు. కోహ్లీ ఇన్ని చేసినా ఆ జట్టుకి కప్ రాలేదు. ఇక 2016 ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ తన విశ్వరూపమే చూపాడు. ఆ సీజన్ లో మొత్తం 973 పరుగులు చేసి.. బెంగుళూరుని ఫైనల్ కి తీసుకెళ్లాడు. కానీ.., అక్కడ కూడా ఆ జట్టుకి నిరాశే ఎదురైంది. ఆ సీజన్ లో సన్ రైజర్స్ విజేతగా నిలిచింది. ఇలా.. ఈ పదేళ్ల కాలంలో బెంగుళూరుని విజేతగా నిలపడానికి కోహ్లీ పడని కష్టం లేదు. అయినా.. అతనికి కాలం కలసి రాలేదు.
ఇక ఇప్పుడు బెంగుళూరు జట్టుకు కోహ్లీ కెప్టెన్ కాదు. సౌతాఫ్రికా సీనియర్ ప్లేయర్ ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ప్లే ఆఫ్స్ కి చేరిన బెంగుళూరు కనుక.. ఇపుడు వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి.. కప్ కొడితే ఆ క్రెడిట్ అంతా ఫాఫ్ డు ప్లెసిస్ అకౌంట్ లోకి వెళ్ళిపోద్ది. పైగా.., కెప్టెన్ అయిన మొదటి సీజన్ లోనే ఫాఫ్ డు ప్లెసిస్ ఆర్సీబి కి కప్ అందించాడు. కానీ.., కోహ్లీ మాత్రం 10 ఏళ్ళ సమయాన్ని వృధా చేశాడు. కోహ్లీ కారణంగానే ఆర్సీబికి ఇన్ని ఏళ్ళు కప్ రాలేదు అంటూ.. అతనిపై ట్రోల్స్ కూడా మొదలవుతాయి. ఇలా బెంగుళూరు కప్ గెలిచినా, ఓడిపోయినా.. కోహ్లీకి మాత్రం తలనొప్పులు తప్పేలా కనిపించడం లేదు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : దక్షిణాఫ్రికాతో T20 సరీస్ కు జట్టును ప్రకటించిన BCCI..