ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ది ప్రత్యేక స్థానం. గత 15 సీజన్లుగా ఇప్పటివరకు ఒక్కసారి టైటిల్ నెగ్గకపోయినా ఫాలోవర్స్ లో మాత్రం టాప్ ప్లేస్ లో ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ 9.2 మిలియన్లు, ముంబై ఇండియన్స్ 7.9 మిలియన్లతో తొలి రెండు స్థానాలలో ఉండగా, 6.4 మిలియన్ల ఫాలోవర్స్ తో ఆర్‌సీబీ మూడో స్థానంలో ఉంది. అలాంటి ఆర్సీబీకి ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు బిక్ షాక్ తగిలింది. అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. ఆర్‌సీబీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. దాని పేరును కూడా మార్చేశారు.
శనివారం ఉదయం ఆర్‌సీబీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. దాని పేరును ‘Bored Ape Yacht Club’గా మార్చడమే కాకుండా ఆర్‌సీబీ లోగో, ప్రొఫైల్ పిక్ ని కూడా మార్చారు. అనంతరం ఖాతాలో NFT సంబంధిత ట్వీట్లను కూడా పోస్ట్ చేశారు. ‘సభ్యుడిగా కావడానికి, బోర్‌డ్ అపే లేదా ముటంట్ అపేని కొనుగోలు చేయండి. క్రియేటెడ్ బై యుగ ల్యాబ్స్..’ అంటూ అర్థం కాని ట్వీట్లతో హడలెత్తించారు. అయితే, కాసేపటికి తిరిగి పునరుద్ధరించనప్పటికీ.. అప్పటికే అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Is @RCBTweets handle get hacked …. 🙃🙃 pic.twitter.com/thtEfnrju9
— Saurabh Yadav (@Saurabhkry08) January 21, 2023
ఆర్‌సీబీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం ఇది మొదటిసారి కాదు. 2021 2021 సెప్టెంబర్‌లోనూ ఒకసారి హ్యాక్ అయింది. అలాగే, 2022 ఆగస్టులో ఆర్‌సీబీ యూట్యూబ్ ఛానెల్‌ని హ్యాక్ చేశారు. ఇక ఈ సీజన్ లో కోహ్లీ, మాక్స్ వెల్, డుప్లెసిస్, విల్ జాక్స్ వంటి స్టార్లతో ఆర్‌సీబీ బలంగానే కనిపిస్తోంది. ఈ ఏడాదైనా వారి కల నెరవేరుతుందేమో చూడాలి. ఆర్‌సీబీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అవ్వడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rcb acc hacked?😭 pic.twitter.com/0PoVZaH2yc
— SDS (@Saumyadeep63) January 21, 2023
@RCBTweets‘s Offical statement about their twitter handle. pic.twitter.com/GaRwuwrscY
— Virat Kohli FanTeam (@ViratFanTeam) January 21, 2023