టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి ట్రాక్ ఎక్కాడు. గాయం, సర్జరీ, ఎన్నికలతో కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న జడేజా.. మళ్లీ బాల్, బ్యాట్ పట్టి ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బరిలోకి దిగడమే కాకుండా.. ఏకంగా 7 వికెట్ల హాల్‌తో దుమ్మురేపాడు. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన జడేజా.. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించకుని ఇంటికే పరిమితం అయ్యాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత.. తన భార్య గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో.. ఆ కోసం ప్రచారం చేస్తూ.. ఆటకు దూరంగా ఉన్నాడు. పూర్తిగా ఎన్నికల రంగంలోకి దూకి.. ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపాడు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన భార్యను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాడు.
ఈ గ్యాప్‌లో టీమిండియా టీ20 వరల్డ్ కప్‌తో పాటు.. న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్.. మళ్లీ న్యూజిలాండ్‌తో సిరీస్‌లు ఆడింది. ఈ సిరీస్‌లకు జడేజా దూరంగా ఉన్నాడు. అయితే.. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగానే జడేజా జట్టుకు దూరంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. గాయం పేరుతో జడేజా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడని, దేశం తరఫున క్రికెట్ ఆడటం కంటే.. తన భార్యను ఎన్నికల్లో గెలిపించుకోవడమే జడేజాకు ముఖ్యంగా మారిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. వీటిపై జడేజా ఎప్పుడు స్పందించలేదు. అయితే.. బీసీసీఐ మాత్రం జడేజాను మళ్లీ టీమ్‌లోకి తీసుకోవాడానికి కఠిన పరీక్షే పెట్టింది. టెస్టుల్లో వరల్డ్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా ఉన్న జడేజాను మళ్లీ టెస్టు టీమ్‌లోకి తీసుకోవాలంటే.. జడేజాను దేశవాళీ క్రికెట్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాల్సిందిగా కండీషన్ పెట్టింది.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ.. అందులో జడేజా పేరును కూడా చేర్చింది కానీ.. అతను ఫిట్‌నెస్ సాధిస్తేనే టీమ్‌లో ఉంటాడని ప్రత్యేకంగా పేర్కొంది. దీంతో.. జడేజా రంజీ బరిలోకి దిగాడు. సౌరాష్ట్ర తరఫున తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆడిన జడేజా బ్యాట్‌తో పెద్దగా రాణించకపోయినా.. బౌలింగ్‌తో అదరగొట్టాడు. తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ మాత్రమే తీసిన జడేజా.. రెండు ఇన్నింగ్స్‌లో మాత్రం ఏకంగా 7 వికెట్లతో చెలరేగిపోయాడు. మొత్తం మీద ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసి అవుటైన జడేజా.. బౌలింగ్‌లో మాత్రం 8 వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో జడేజా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగడానికి రెడీ అయినట్లు క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. బీసీసీఐ పెట్టిన టెస్టులో జడేజా వందకు వంద మార్కులతో పాస్ అయినట్లు పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్‌లో తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 17.1 ఓవర్ వేసిన జడేజా.. 53 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అందులో మూడు ఓవర్లు మెయిడెన్. మరి జడేజా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jadeja is back with a bang in AnbuDen! 🥳💛
17.1 Overs | 53 Runs | 7 Wickets#WhistlePodu #RanjiTrophy @imjadeja pic.twitter.com/r6SKazADeI
— WhistlePodu Army ® – CSK Fan Club (@CSKFansOfficial) January 26, 2023