బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ రికార్డు సరసన నిలిచాడు జడేజా.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా టీమిండియా-ఆసిస్ మధ్య మూడో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆసిస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో..109 పరుగులకే కుప్పకూలింది. అయితే అనంతరం బౌలింగ్ లో గొప్ప ప్రదర్శన కనబరిచింది భారత జట్టు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 156 పరుగులకు 5 వికెట్లు కూల్చి ఆసిస్ ను కష్టాల్లోకి నెట్టేసింది. ఇక ఈ మ్యాచ్ లో 4 వికెట్లతో సత్తా చాటాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. దాంతో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ సరసన నిలిచి అరుదైన ఘనత దక్కించుకున్నాడు జడేజా.
రవీంద్ర జడేజా.. గాయం కారణంగా ఐదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. దాంతో అతడి రీ ఎంట్రీపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఈ అనుమానాలన్నింటికీ తాజాగా తన ఫర్పామెన్స్ తో సమాధానం ఇచ్చాడు జడ్డు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్ తో జరుగుతున్న మ్యాచ్ ల్లో దుమ్మురేపుతున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. తొలి రెండు టెస్ట్ ల్లో కలిపి 14 వికెట్లు తీసిన జడేజా.. ఈ మ్యాచ్ లో కూడా బంతితో చెలరేగి 4 వికెట్లు నేల కూల్చాడు. ఇక ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను అవుట్ చేయడం ద్వారా.. టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ సరసన నిలిచాడు జడేజా.
ఇక ఈ వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో 500 వికెట్లు తీయ్యడంతో పాటుగా.. 5వేల పరుగులు పూర్తి చేసిన రెండో టీమిండియా ఆటగాడిగా నిలిచాడు జడ్డూ భాయ్. ఇప్పటి వరకు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ మీదే ఉంది. తాజాగా ఈ రికార్డు సరసన నిలిచాడు రవీంద్ర జడేజా. ఇక ఈ మ్యాచ్ లో జడేజా నాలుగు వికెట్లు పడగొట్టి ఆసిస్ నడ్డి విరిచాడు. ప్రస్తుతం జడ్డూ టెస్టుల్లో నెం.1 ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ సరసన నిలిచి అరుదైన ఘనత సాధించిన జడేజాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Two legends of Indian cricket 😍🇮🇳#India #KapilDev #RavindraJadeja pic.twitter.com/fZ8B2H5DIV
— Sportskeeda (@Sportskeeda) March 1, 2023