తన కెరీర్‌లో మొత్తం 61 టెస్టులు ఆడి.. 3982 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 17 వన్డేల్లో 339 రన్స్, 9 టీ20ల్లో 169 పరుగులు చేశాడు. అనంతరం పూర్ ఫామ్‌తో జట్టులో స్థానం కోల్పోయిన క్రికెటర్‌ను రవిచంద్రన్ అశ్విన్.. టెస్టుల్లో గ్రేటెస్ట్ ఇండియన్ ఓపెనర్‌గా పేర్కొన్నాడు.
టీమిండియా స్టార్ స్పిన్నర్, సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర స్టేట్‌మెంట్ ఇచ్చాడు. టెస్టు క్రికెట్‌లో ఇండియాకు గ్రేటెస్ట్ ఓపెనర్ ఇతనే అంటూ ఓ క్రికెటర్ గురించి ప్రస్తావించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో ఫుల్ బిజీగా ఉన్న అశ్విన్.. రెండు టెస్టు ప్రారంభానికి ముందు ఈ వ్యాఖ్య చేశాడు. టెస్టు క్రికెట్‌లో గ్రేటెస్ట్ ఓపెనర్‌గా అశ్విన్ మనసు గెలుచుకున్న ఆ క్రికెటర్ ఎవరని అనుకుంటున్నారా? అతనెవరో కాదు.. టీమిండియా వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్. తమిళనాడుకు చెందిన మురళీ విజయ్ టీమిండియా తరఫున చాలా టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత.. టెస్టు క్రికెట్‌లో ఇండియాకు గ్రేటెస్ట్ ఓపెనింగ్ బ్యాటర్ మురళీ విజయ్ అంటూ అశ్విన్ పేర్కొన్నాడు.
2008లో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విజయ్.. 2018లో టీమిండియా తరఫున చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. తన కెరీర్‌లో మొత్తం 61 టెస్టులు ఆడిన విజయ్.. 3982 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 17 వన్డేల్లో 339 రన్స్, 9 టీ20ల్లో 169 పరుగులు చేశాడు. అనంతరం పూర్ ఫామ్‌తో జట్టులో స్థానం కోల్పోయిన విజయ్.. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి తిరిగి రాలేదు. అలాగే.. దినేష్ కార్తీక్‌తో రిలేషన్‌షిప్ కూడా మురళీ విజయ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. ఇక మురళీ విజయ్‌తో పాటు పుజారా గురించి కూడా మాట్లాడిన అశ్విన్.. వారిద్దరిలోనూ కొన్ని కామన్ విషయాలు ఉన్నట్లు తెలిపాడు. అయితే.. పుజారా, విజయ్ మధ్య ఒకసారి జరిగిన వాగ్వాదం గురించి కూడా అశ్విన్ వెల్లడించాడు. ఇద్దరి మధ్య ఒక రన్ విషయాలో చాలా సేపు వాదన జరిగిందని.. పుజారా మాత్రం చాలా గట్టిగా ఒక మాట మీద నిలబడ్డాడని, మురళీ విజయ్ తన చెప్పిన దానికి సపోర్ట్ కోసం ఇతర ఆటగాళ్ల మద్దతు కోరాడని అశ్విన్ పేర్కొన్నాడు. పుజారా తన బ్యాటింగ్ మెథడ్‌ను చాలా బలంగా నమ్ముతాడని, ఎవరు కూడా తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చలేరని అన్నాడు.
ప్రస్తుతం పుజారా అశ్విన్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌పైనే చాలా ఫోకస్‌గా ఉన్నారు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పుజారా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేదు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కానీ.. అశ్విన్ మాత్రం 8 వికెట్లుతో చెలరేగాడు. ముఖ్యంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల హాల్ సాధించాడు. అశ్విన్ దెబ్బకు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్ స్పిన్‌కు భయపడిన ఆస్ట్రేలియా.. అతని బౌలింగ్ యాక్షన్‌లా ఉంటే భారత యువ బౌలర్ మహేష్ పితియాను తమ నెట్ బౌలర్‌గా నియమించకుని.. తొలి టెస్టుకు ముందు తెగ ప్రాక్టీస్ చేసింది. కానీ తీరా మ్యాచ్ మొదలయ్యాక అసలైన అశ్విన్‌ను ఆడలేక ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మరి తొలి టెస్టులో అశ్విన్ బౌలింగ్‌తో పాటు, మురళీ విజయ్‌ని టెస్టుల్లో గ్రేటెస్ట్ ఓపెనర్‌గా పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ravi Ashwin said, “Murali Vijay to me is the greatest Test opener for India outside of Sunil Gavaskar and Virender Sehwag”. (To Espncricinfo).
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 15, 2023