టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ కూడా ఇంగ్లండ్ పర్యటన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్‌తో బరిలోకి దిగనున్నాడు. దీంతో కోహ్లీ ఎలా ఆడతాడనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆఫ్ఘానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్.. విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడని తనకు అనిపించడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే ఐపీఎల్ 2022 సందర్భంగా ఒక విషయంలో విరాట్ కోహ్లీ తనను ఎంతగానో ఆశ్చర్యపర్చిన సంఘటన గురించి వెల్లడించాడు.
‘ఐపీఎల్ 2022 సీజన్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు ముందు రోజు ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ నన్ను ఎంతో ఆశ్యర్యపర్చింది. అతను దాదాపు రెండున్నర గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మిగతా జట్టు సభ్యులంతా నెట్ సెషన్స్ ముగించుకుని వెళ్లిపోయినా కోహ్లీ మాత్రం నెట్స్‌లో శ్రమిస్తూనే ఉన్నాడు. అలాగే నేను ప్రాక్టీస్ వచ్చే టైమ్‌లో కోహ్లీని నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా చూశా.. ఆ తర్వాత నేను నా నెట్ సెషన్స్ ముగించుకుని వెళ్లిపోతున్న టైమ్‌లో కూడా కోహ్లీ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంత గొప్ప ప్లేయర్ ఇంతలా శ్రమించడం ననెంతో సర్‌ప్రైజ్ చేసింది. అలాగే తర్వాత రోజు మ్యాచ్‌లో కోహ్లీ 70 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం కూడా సాధించింది.’ అని రషీద్ ఖాన్ వెల్లడించాడు. అలాగే విరాట్ కోహ్లీ ఫామ్‌పై కూడా రషీద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడని అంటున్నారు, అది నిజం కాదు. కోహ్లీపై ఉన్న అంచనాలే ప్రస్తుతం అతను ఫామ్‌లో లేడనే భ్రమను కలిగిస్తున్నాయి. కోహ్లీ కొంత కాలంగా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేదు నిజమే.. కానీ జట్టుకు అవసరమైన పరుగులు మాత్రం చేస్తున్నాడు. టెస్టుల్లో కోహ్లీ 50లు, 60లు చేస్తున్నాడు. కానీ.. అతనిపై ఉన్న అంచనాలు ముందు ఇవి చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. కోహ్లీ అంత గొప్ప ఆటగాడు కనుకనే అతను ప్రతి మ్యాచ్‌లో సెంచరీ చేయాలని అందరూ కోరుకుంటారు. అందుకే అతను ఇప్పుడు ఫామ్‌లో లేడని చాలా మందికి అనిపిస్తుంది.
అయినా కోహ్లీ ఆడే షాట్లు చూస్తుంటే అతను ఫామ్‌లోనే ఉన్నాడని అనిపిస్తుంది’ అని రషీద్ పేర్కొన్నాడు. అలాగే కోహ్లీపై ఒత్తిడి గురించి మాట్లాడుతూ.. ‘కోహ్లీతో మాట్లాడుతున్న సమయంలో నాకో విషయం అర్థమైంది. తన గురించి ఎవరెవరు ఏం అనుకుంటున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారనే విషయం కోహ్లీ మైండ్‌లోనే ఉండదు. అసలు అతను అవన్నీ పట్టించుకోడు అనిపించింది.’ అని అన్నాడు. మరి చాలా కాలంగా సెంచరీ చేయని కోహ్లీ త్వరలోనే సెంచరీ చేస్తాడని రషీద్ అన్నాడు. మరి కోహ్లీపై రషీద్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఈ స్థాయికి వచ్చానంటే.. ఎన్ని చూసి ఉంటాను: విరాట్ కోహ్లీ
Virat Kohli meets Rashid Khan in practice session today. pic.twitter.com/mLOWlvCLM5
— Ishika Pandey (@Ishika_Pandey45) August 25, 2022
Rashid Khan was completely shocked by Kohli, here’s whyhttps://t.co/rJCt8XNbqL
— HT Sports (@HTSportsNews) August 25, 2022