మరో నాలుగు రోజుల్లో ప్రతిష్టాత్మక ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడినట్లు సమాచారం. ఆసియా కప్ కోసం యూఏఈకి బయలుదేరే ముందు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆసియా కప్‌కు ద్రవిడ్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ద్రవిడ్ స్థానంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు, ప్రస్తుత ఎన్‌సీఏ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసియా కప్‌లో టీమిండియా కోచ్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మరో ఫాస్ట్‌బౌలర్ హర్షల్ పటేల్ గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా కోచ్ ద్రవిడ్ కూడా దూరమవ్వడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని క్రికెట్‌నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా టీమిండియా జింబాబ్వే పర్యటన నేపథ్యంలో ద్రవిడ్‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జింబాబ్వే పర్యటనకు లక్ష్మణ్‌ను కోచ్‌గా పంపించారు. జింబాబ్వే టూర్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని టీమిండియా వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
JUST IN: Rahul Dravid won’t be travelling to the UAE, immediately at least. In his absence, arrangements are being made to send VVS Laxman to join the Indian team at the Asia Cup.https://t.co/2gVLLHpwhE
— Cricbuzz (@cricbuzz) August 23, 2022
No word yet on whether Rahul Dravid will be able to travel to the UAE for Asia Cup 2022 | #AsiaCup #Cricket #RahulDravid https://t.co/Hja9SbCNnl
— India Today Sports (@ITGDsports) August 23, 2022