గాల్లో ఎగురుతూ అందుకునే సూపర్‌మ్యాన్ క్యాచ్‌లు పురుష క్రికెట్‌లోనే కాదు.. మహిళల క్రికెట్‌లోనూ సూపర్‌ఉమెన్ క్యాచ్‌లు ఉంటాయి. ఒక అద్భుతమై క్యాచ్‌తో పాటు రనౌట్ ఇలా కూడా చెయొచ్చా అని ఆశ్యర్యపోయేలా చేశారు.. ఇండియన్ ఉమెన్స్ టీమ్ ప్లేయర్ రాధా యాదవ్. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాను 11వ ఓవర్‌లో రాధా యాదవ్ దారుణంగా దెబ్బతీసింది. రాధా వేస్తున్న ఆ ఓవర్ తొలి బంతిని మొనీ స్ట్రేట్‌డ్రైవ్ ఆడింది. క్షణాల తేడాతో ఆ బంతిని అందుకున్న రాధా.. తన కాళ్ల మధ్య నుంచి బంతిని వికెట్లకు వేసింది. గురి తప్పకుండా బంతి వికెట్లను తాకింది. నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న ఆసీస్ లానింగ్ అప్పటికే క్రీజ్ బయటికి వచ్చినట్లు గమనించిన భారత ఆటగాళ్లు రనౌట్‌కు అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేసి పరిశీలస్తే.. అది అవుట్‌గా తేలింది. దీంతో.. తాను చేసిన మిరాకిల్‌ను రాధా యాదవ్ తానే నమ్మలేకపోయింది. నమ్మశక్యం కాని రీతిలో లానింగ్‌ను రనౌట్ చేసింది.
ఆ వెంటనే దీప్తి శర్మ వేసిన 12వ ఓవర్‌లో మరో అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకుని మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది. దీప్తి వేసిన 12వ ఓవర్ తొలి బంతిని తహ్లియా మెక్‌గ్రాత్ కాట్ షాట్ ఆడింది. మెరుపు వేగంతో దూసుకెళ్తున్న ఆ బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాధా యాదవ్ తన ఎడమవైపుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకుంది. ఇలా స్టన్నింగ్ క్యాచ్, అద్భుతమైన రనౌట్‌తో రాధా యాదవ్ అదరగొట్టింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో భారత్ 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై.. 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గోల్డ్ మెడల్ ఆస్ట్రేలియాకు, సిల్వర్ మెడల్ ఇండియాకు దక్కాయి. మరి ఈ మ్యాచ్‌లో రాధా యాదవ్ సూపర్ ఫీల్డింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
That catch from Radha Yadav🔥 #INDvsAUS pic.twitter.com/OhfyEa5X6R
— Female Cricket #B2022 (@imfemalecricket) August 7, 2022
Radha Yadav’s diving catch 🔥😍#INDvsAUS pic.twitter.com/TmhAVJVjLD
— Female Cricket #B2022 (@imfemalecricket) August 7, 2022
🏏 Howzat for quick thinking?
A quite brilliant run-out by @WeareTeamIndia‘s Radha Yadav.
📺 Catch all the action live NOW!#CommonwealthGames #B2022 pic.twitter.com/oVi1KGeQ9c
— Commonwealth Sport (@thecgf) August 7, 2022
ఇది కూడా చదవండి: ‘కొడితే సిక్సర్ లేదంటే బౌండరీ’.. ఇంగ్లాండ్ బౌలర్లను బెంబేలెత్తించిన స్మృతి మందాన!