అర్ష్ దీప్.. భారత్-పాక్ మ్యాచ్ తర్వాత ప్రపంచం మెుత్తం వినిపిస్తోన్న పేరు. దానికి కారణం ఏంటో మీకూ తెలుసు. భారత్-పాక్ మ్యాచ్ లో 18 వ ఓవర్లో రవి బిష్ణోయ్ బౌలింగ్ లో పాక్ బ్యాటర్ ఆసిఫ్ అలీ ఇచ్చిన సింపుల్ క్యాచ్ ను అర్ష్ దీప్ సింగ్ వదిలేశాడు. దీంతో లైఫ్ పొందిన అతడు 8 బంతుల్లో 16 పరుగులు చేసి పాక్ కు చిరస్మరణియమైన విజయాన్ని అందించాడు. దాంతో అర్ష్ దీప్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మైదానంలో కెప్టెన్ రోహిత్ సైతం అర్ష్ దీప్ పై అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఇన్ని విమర్శల నేపథ్యంలో ఓ క్రీడా మంత్రి అర్ష్ దీప్ అమ్మతో మాట్లాడాడు. అతడికి అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
“ఆట అన్నాక తప్పులు జరగడం.. చేయడం సహజమే. అంత మాత్రానా ఆ తప్పు చేసిన ఆటగాడి ని విమర్శించడం తగదు..” అర్ష్ దీప్ కు అండగా నిలుస్తూ కింగ్ కోహ్లీ అన్న మాటలు ఇవి. పాక్ పై క్యాచ్ విడిచిన తర్వాత అర్ష్ దీప్ విమర్శలు తారా స్థాయికి చేరాయి. అవి ఎంతలా అంటే అతడి వీకీపీడియాలో అతడి దేశం పేరు ఖలిస్తాన్ అని ఎడిట్ చేసేంతలా విమర్శలు, ఫొటో ఎడిట్ లు చేశారు కొందరు. ఇక మరికొందరు జాతి వివక్షపూరిత మాటలు కూడా అతడిపై సంధించారు. ఈ విషయంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అతడికి అండగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. వీకీపీడియా విషయంలో కేంద్ర ప్రభుత్వం వీకీపీడియా కు సమన్లు కూడా పంపింది.
ఇన్ని విమర్శల నేపథ్యంలో అర్ష్ దీప్ కు ఆమ్ ఆద్మీ పార్టికి చెందిన పంజాబ్ క్రీడా మంత్రి గుర్మీత్ సింగ్ మద్దతుగా నిలిచాడు. అతడికి భరోసాని కల్పిస్తూ.. అర్ష్ దీప్ తల్లితో ఫోన్ లో మాట్లాడాడు. మంత్రి గుర్మీత్ సింగ్ ఆమెతో మాట్లాడుతూ..” అసలు ఆట గురించి తెలియని వారు కూడా అర్ష్ దీప్ ను విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు అంత సీరియస్ గా తీసుకోకండి. భారత్ మెుత్తం మీ కొడుక్కి అండగా ఉంది. మీ కొడుకు చాలా ప్రతిభ ఉన్న ఆటగాడు.. ఎలాంటి ఆటగాడికైనా ఇలాంటి పరిస్థితులు ఎదురౌతూనే ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడే వాడే అసలైన విజేతలు అవుతారు. ఆ లక్షణాలు అన్నీ మీ కుమారుడిలో ఉన్నాయని” ఆయన అన్నారు. మరి ఇన్ని విమర్శల నేపథ్యంలో ఓ క్రీడా మంత్రి ఫోన్ చేసి మాట్లాడటం అభినందించదగ్గ విషయమే. మరి మంత్రి గుర్మీత్ సింగ్ అర్ష్ దీప్ తల్లితో మాట్లాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Punjab के Sports Minister @meet_hayer ने Indian Cricketer @arshdeepsinghh की Mother से Phone पर की बात
“पूरा देश Arshdeep के साथ है। जब वो वापस लौटेंगे तो मैं आपके साथ उन्हें Receive करने जाऊंगा और उनका ढोल-नगाड़े के साथ स्वागत करेंगे। वो Final जीत कर आएंगे”#IStandWithArshdeep pic.twitter.com/MjWzYaJheI
— AAP (@AamAadmiParty) September 5, 2022