SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Priya Singh Bodybuilder Rajasthan

ఊరంతా అవమానించినా.. ఆమె మాత్రం రాష్ట్రానికే పేరు తెచ్చింది!

  • Written By: Nagarjuna
  • Updated On - Wed - 13 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఊరంతా అవమానించినా.. ఆమె మాత్రం రాష్ట్రానికే పేరు తెచ్చింది!

“పెళ్ళైతే ఇక మహిళల జీవితం అయిపోయినట్టే. ఏమైనా కలలు కనాలనుకుంటే పెళ్ళికి ముందే కనేయండి. ఎందుకంటే పెళ్లయ్యాక ఆ పప్పులేమీ ఉడకవు. భర్తే ప్రపంచం, సర్వస్వం. ఇంటిని చూసుకోవడం కంటే గొప్ప అచీవ్మెంట్ ఏముంటుంది? నాలుగు గోడల మధ్య నలిగిపోవాల్సిందే” అని ఆటవిక సమాజం ఎప్పుడూ కలలు కనే ఆడపిల్లల్ని చిదిమేస్తుంటుంది.

నాలుగు గోడల మధ్య తన కల చెరిగిపోకూడదని, తన కలని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని కంకణం కట్టుకున్నదో వివాహిత. గరిటె పట్టుకోవాల్సిన చేత్తో డంబుల్స్ పట్టుకుంది. కట్ చేస్తే ఇవాళ రాజస్థాన్ లో మొట్టమొదటి మహిళా బాడీ బిల్డర్ అయ్యింది. ఐదో తరగతిలో చదువు ఆగిపోయింది. ఎనిమిదేళ్ల వయసులో పెళ్లయిపోయింది. గొర్రెలు కాసుకునే స్థితి నుండి బాడీ బిల్డర్ అయ్యింది. ఆమె ఎవరు? ఆమె కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.

LadyBodybuilder

ఆమె పేరు ప్రియా సింగ్. రాజస్థాన్ కు చెందిన మొట్ట మొదటి మహిళా బాడీ బిల్డర్. బికనేర్ జిల్లాలో చిన్న గ్రామం. అయిదవ తరగతి వరకూ చదువుకుంది. ఎనిమిదేళ్ల వయసులో పెళ్లయిపోయింది. కానీ మేజర్ అయ్యే వరకూ పుట్టింట్లోనే ఉండాలన్నారు. మేలి ముసుగులో గొర్రెలు కాయడం, కట్టెలు కొట్టడం, ఇంటి పని చేసుకోవడం తప్ప వేరే లోకం లేదు. ఈ లోకంలోనే ఉంటే తమ బతుకులు కాలిపోతాయని ఆమె భావించింది. కుటుంబం కోసం మగాడిగా మారింది.

ఆర్ధిక సమస్యల కారణంగా తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు, అదే సమయంలో తన కలని నెరవేర్చుకునేందుకు జిమ్ ట్రైనర్ అవతారం ఎత్తింది ప్రియా సింగ్. ఉన్న ఊరు నుంచి జైపూర్ కి బయలుదేరింది. ఓ జిమ్ సెంటర్ లో ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆమె హైట్, పర్సనాలిటీ వల్ల సెలెక్ట్ అయ్యింది. ట్రైనర్ గా ఉద్యోగంలో చేరింది. ట్రైనర్ అయిన అతి తక్కువ సమయంలోనే అన్ని ఎక్సర్సైజులు నేర్చుకుంది. జిమ్ లో అందరూ తనని పహిల్వాన్ అనేవారు. మగాళ్లు సైతం ఈమె దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు.

LadyBodybuilder

 

బాడీ బిల్డర్ కావాలని నిర్ణయించుకున్న ప్రియా సింగ్ కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఈమె వాటన్నిటినీ ఎదిరించి నిలబడింది. “మహిళలు బాడీ బిల్డింగ్ చేయడం చాలా కష్టం. మగాళ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ వర్కవుట్లు చేయాలి. మగాళ్ల కంటే మూడు రెట్లు ఎక్కువగా ప్రోటీన్లు తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే మహిళలు బాడీ బిల్డర్లు అవ్వచ్చు” అంటూ ఆమె సలహా ఇస్తుంది.

నీకెందుకు బాడీ బిల్డింగు, ఇల్లు చక్కబెట్టుకో, పిల్లల్ని చూసుకో అంటూ ఆమెను ఎంతోమంది నిరుత్సాహపరిచారు. కొంతమంది మగరాయుడు అన్నారు, బికినీ వేసుకోవడానికి సిగ్గు లేదా అని తిట్టారు. ఆమెకు వ్యతిరేకంగా వేల కామెంట్స్ వచ్చాయి. అది తెలిసి ఆమె అన్నయ్య చంపేస్తా అని బెదిరించాడు. అయినప్పటికీ ఆమె భయపడలేదు. సమాజం చిన్న చూపు చూసినా గానీ తల్లిదండ్రులు, భర్త, పిల్లలు ఈమెకు అండగా నిలబడ్డారు.

LadyBodybuilder

 

వంట గదిలోకి వెళ్ళడానికి ఏ మాత్రం ఇష్టపడని ప్రియా సింగ్, తాను కన్న కలని నిజం చేసుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
మూడు సార్లు మిస్ రాజస్థాన్ టైటిల్స్, పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. బాడీ బిల్డింగ్ లోకి వచ్చాక వంట గదిలోకి వెళ్లడమే మానేసిందట. టిఫిన్ కావాలంటే ఆమె కూతురే తీసుకొచ్చి ఇస్తుందట. ఈరోజు ఆమె ఇలా బాడీ బిల్డర్ గా ఉండడానికి కారణం తన కూతురే అని గర్వంగా చెప్పుకుంటుంది.

జిమ్ లో ఉన్నంత సేపే తాను ట్రైనర్ గా ఉంటానని, ఇంటికెళ్తే ఆ తాలూకు వాసన ఉండదని ఆమె చెబుతోంది. డంబుల్స్ పట్టుకున్న చేతికి గాజులు, నుదిట బొట్టు, సాంప్రదాయాన్ని తలదన్నేలా కట్టు అన్నీ పాటిస్తానని ఆమె చెబుతుంది. అమ్మాయిలు కూడా తనలా దృఢంగా ఉండాలని ఆమె చెబుతోంది. “ఏదైనా పని చేసే ముందు మెదడు, మనసుతో రెండింటితో ఆలోచించండి. మంచి పని అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేసేయండి. సెల్ఫ్ డిపెండెంట్ గా ఉండండి” అంటూ ఆమె యువతకి సలహా ఇస్తోంది.

LadyBodybuilder

ఒకరి ఎదుగుదలకు ఊరు అడ్డుపడుతుందంటే, ఆ ఒకరే రేపు అలాంటి ఊర్లున్న రాష్ట్రానికో, దేశానికో ఆదర్శంగా నిలిచేంత గొప్ప స్థాయికి ఎదుగుతారు అనడానికి ప్రియా సింగే నిదర్శనం. మరి ఎన్నో అవమానాలను దాటుకుని అందరి అభిమానం సొంతం చేసుకున్న రాజస్థాన్ బాడీ బిల్డర్ ప్రియా సింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఎనిమిదేళ్ల వయసులో పెళ్లవడంతో మేలి ముసుగులోనే గొర్రెలు కాసిన ప్రియా సింగ్.. రాజస్థాన్‌లో మొదటి మహిళా బాడీ బిల్డర్‌ ఎలా అయ్యారు?#Rajasthan #WomenPower #LadyBodybuilder pic.twitter.com/BrvJklL9kb

— BBC News Telugu (@bbcnewstelugu) July 12, 2022

Tags :

  • LadyBodybuilder
  • national news
  • Priya Singh
  • Rajasthan
  • WomenPower
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam