“పెళ్ళైతే ఇక మహిళల జీవితం అయిపోయినట్టే. ఏమైనా కలలు కనాలనుకుంటే పెళ్ళికి ముందే కనేయండి. ఎందుకంటే పెళ్లయ్యాక ఆ పప్పులేమీ ఉడకవు. భర్తే ప్రపంచం, సర్వస్వం. ఇంటిని చూసుకోవడం కంటే గొప్ప అచీవ్మెంట్ ఏముంటుంది? నాలుగు గోడల మధ్య నలిగిపోవాల్సిందే” అని ఆటవిక సమాజం ఎప్పుడూ కలలు కనే ఆడపిల్లల్ని చిదిమేస్తుంటుంది. నాలుగు గోడల మధ్య తన కల చెరిగిపోకూడదని, తన కలని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని కంకణం కట్టుకున్నదో వివాహిత. గరిటె పట్టుకోవాల్సిన చేత్తో డంబుల్స్ […]