టీమిండియా కుర్రాళ్లు మంచి ఊపుమీదున్నారు. అందుకు తగ్గట్లే వన్డే సిరీస్ ని 3-0 తేడాతో చేజిక్కుంచుకున్న భారత జట్టు.. టీ20 సిరీస్ లో మాత్రం తొలి మ్యాచులోనే ఓడిపోయింది. కానీ రెండో టీ20లో మాత్రం పుంజుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ కోసం రెడీ అయిపోయింది. ఇక గెలుపే టార్గెట్ గా ఈ మ్యాచ్ లో గెలిచి, సిరీస్ పట్టేయాలని హార్దిక్ సేన చూస్తోంది. అయితే ఇలాంటి టైంలో ఓ విషయం మాత్రం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల జట్టునే తీసుకుంటే వన్డేల్లో సీనియర్లు ఉన్నప్పటికీ, టీ20 టీమ్ లో మాత్రం దాదాపు అందరూ కుర్రాళ్లే కనిపిస్తున్నారు. ఉన్న ఒకరిద్దరూ సీనియర్లు కూడా మరికొన్నాళ్లపాటే ఉండొచ్చు. అది తప్పితే వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మేనేజ్ మెంట్ పెద్ద ప్లానింగ్ తో ఉన్నట్లే కనిపిస్తుంది. అందుకు తగ్గట్లే జట్టులో స్థానం కోసం ఒక్కో దానికి ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. ఛాన్స్ రావడమే లేటు తమ టాలెంట్ చూపిస్తూ గ్రౌండ్ లో రెచ్చిపోతున్నారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. గత కొన్నాళ్ల నుంచి దేశవాళీలో దుమ్ములేపుతున్న ముంబయి బ్యాటర్ పృథ్వీషా చాలాకాలం తర్వాత కివీస్ తో టీ20 సిరీస్ కోసం జట్టులోకి సెలెక్ట్ అయ్యాడు. రంజీల్లో రికార్డులు సృష్టించిన ఈ సంచలన ఆటగాడు.. ఎట్టకేలకు సెలక్టర్స్ కరుణించడంతో తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే మ్యాచ్ ఆడే టీమ్ లో మాత్రం ప్లేస్ సంపాదించలేకపోయాడు. తాజాగా మూడో టీ20లోనూ అతడిని పక్కనబెట్టేశారు. దీంతో జట్టులో తీసుకున్నారనే ఆనందం తప్పితే.. ఆడటం అనే హ్యాపీనెస్ ని పృథ్వీషా సొంతం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచులోనూ గిల్-ఇషాన్ కిషన్ జోడీనే ఓపెనింగ్ చేయనుంది. మరి పృథ్వీషాను మూడు టీ20ల్లోనూ పక్కనబెట్టడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
The wait continues for Prithvi Shaw as he continues to get benched for the 3rd T20I.#PrithviShaw #India #INDvsNZ #ShubmanGill #CricTracker pic.twitter.com/pJlsblx5CW
— CricTracker (@Cricketracker) February 1, 2023