సెల్ఫీ ఇవ్వలేదని టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటనలో దాడి చేసిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు ఓషివారా పోలీసులు. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
సెల్ఫీ ఇవ్వలేదని టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. దాంతో దాడి చేసిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు ఓషివారా పోలీసులు. ఇక పృథ్వీ షాపై దాడి చేసిన వారిలో ఓ ఇన్ స్టా గ్రామ్ మోడల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ మోడల్ పేరు సప్నా గిల్.. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగే వేరు. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పృథ్వీ షానే నాపై దాడి చేశాడని మోడల్ సప్నా ఆరోపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పృథ్వీ షా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్న పేరు. దానికి కారణం సెల్ఫీలు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో 8 మంది వ్యక్తులు మూకుమ్మడిగా షాపై దాడి చేశారు. డిన్నర్ చెయ్యడానికి షా అతడి స్నేహితుడు కలిసి వచ్చిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హోటల్ బయట ఉన్న షా కారు దగ్గర కాపు కాసిన సదరు వ్యక్తులు, షా, అతడి స్నేహితుడు బయటకి రాగానే ఒక్కసారిగా వారి కారుపై బేస్ బాల్ స్టిక్స్ తో దాడి చేశారు. దాంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ విషయంపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు షా, అతడి స్నేహితుడు. దాంతో ఆ 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఓషివారా పోలీసులు.
అయితే ఈ కేసులో ఓ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే? ఆ 8 మందిలో ఉన్న ఓ ఇన్ స్టా గ్రామ్ మోడల్.. తనతో పృథ్వీ షా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తోంది. ఆ సమయంలో షా చేతిలో స్టిక్ కూడా ఉన్నట్లు సప్నా గిల్ చెబుతోంది. అందుకే మేం ప్రతి దాడి చేశాం అన్నది ఆ మోడల్ వాదన. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులోనే ఉంది. పృథ్వీ షా, అతడి స్నేహితులు కలిసి సప్నా గిల్ పై దాడి చేశారని సప్నా గిల్ లాయర్ అలీ ఖాషీప్ చెప్పారు. ఇక ఆమెను వైద్య పరీక్షలకు కూడా పంపట్లేదని ఈ సందర్బంగా లాయర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం మోడల్ సప్నా గిల్ తో పాటుగా మరో ఏడుగురు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వారిని రేపు కోర్ట్ లో ప్రవేశపెడతామని పోలీసులు వెల్లడించారు.
అసలు ఈ సంఘటనలో జరిగింది ఏంటంటే? పృథ్వీ షా, అతడి స్నేహితుడు కలిసి డిన్నర్ చెయ్యడానికి ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లారు. వారు హోటల్ లోకి ఎంట్రీ ఇవ్వగానే మోడల్ సప్నా గ్యాంగ్ షాతో సెల్పీలు దిగేందుకు ఎగబడ్డారు. దాంతో వారికి సెల్ఫీలు ఇచ్చాడు షా. అయతే మరికొన్ని యాంగిల్స్ తో మరిన్ని ఫోటోలు అడగడంతో.. నేను ఫ్రెండ్ తో డిన్నర్ చెయ్యడానికి వచ్చాను డిస్ట్రబ్ చెయ్యకండి అని షా రిక్వెస్ట్ చేశాడు. వారు వినకపోవడంతో హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు షా, అతడి స్నేహితుడు. దాంతో వారు వచ్చి సప్నాగిల్ గ్యాంగ్ ను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ ఇన్సిడెంట్ పై పగపెంచుకున్న వారు.. హోటల్ బయటే ఉండి ఇలా దాడికి తెగబడ్డారు. పైగా రూ. 50 వేలు ఇస్తేనే మిమ్మల్ని విడిచిపెడతాం అని బెదిరించినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.