విరాట్ కోహ్లీ.. ఈ రన్ మెషిన్ పేరు చెప్పగానే అభిమానులకు పూనకం రావడం సహజం. అందుకు కారణం.. ఫీల్డ్‌లో కోహ్లీ చూపించే అగ్రెసివ్ బిహేవియరే. ఈ బిహేవియర్ తో.. కోహ్లీ ఎంత మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడో, అదే సంఖ్యలో విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఈ రన్ మెషిన్ ఫామ్ కోల్పోయి ..పరుగులు చేయలేక నానా తంటాలు పడుతున్నాడు. దీని ఫలితంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కు సైతం దూరంగా ఉంటున్నాడు. మరి.. ఫీల్డ్‌లో అంత అగ్రెసివ్ గా కనిపించే విరాట్ కోహ్లీ.. అండర్- 19 క్రికెట్ ఆడే సమయంలో ఎలా ఉండేవాడు. ఒకానొక సమయంలో.. ఒంటరిగా కూర్చొని ఏడ్చాడట. కోహ్లీ.. మరీ అంత ఎమోషనల్ పర్సనా..? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను.. ఢిల్లీ క్రికెటర్ ప్రదీప్ సాంగ్వాన్ బయటపెట్టాడు.
విరాట్ కోహ్లీ, ప్రదీప్ సాంగ్వాన్.. ఇద్దరు అండర్ 19 వరల్డ్ కప్ 2008 టోర్నీ ఆడిన జట్టులో సభ్యులు. అంతేకాదు.. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడాను. అందుకే విరాట్ కోహ్లీ గురుంచి చాలా విషయాలు ఇతనికి తెలుసు. ఈ క్రమంలో..అండర్- 17 క్రికెట్ ఆడే రోజుల్లో కోహ్లీ విషయంలో జరిగిన ఒక సంఘటను ప్రదీప్ సాంగ్వాన్ బయటపెట్టాడు. “మేం పంజాబ్‌లో అండర్ 17 క్రికెట్ ఆడుతున్న రోజులవి. ఆ సమయంలోనూ.. కోహ్లీనే మా మెయిన్ ప్లేయర్. అయితే.. కోహ్లీ అంతకుముందు ఆడిన 2-3 మ్యాచుల్లో పెద్దగా పరుగులు చేయలేదు. అప్పుడు మాకు కోచ్‌గా అజిత్ చౌదరీ ఉండేవారు.
“During U-17 match in Punjab. Ajit sir our coach funnily suggested, ‘Let’s tell Virat Kohli he will not play in next match’. We all joined in on prank. But he went to his room & started crying & wasn’t able to sleep in night then I told him it was all a prank.” – Pradeep Sangwan
— Virat_kohli_fanpage_18 (@saurabhvkf18) June 8, 2022
ఒకరోజు అజిత్ సర్ నా దగ్గరకొచ్చి.. ‘మనం సరదాగా ఓ ప్రాంక్ చేద్దాం అన్నాడు.. సరే సర్ అన్నాను. నువ్ కోహ్లీ దగ్గరికి వెళ్లి, వచ్చే మ్యాచ్‌లో అతను ఆడడం లేదని చెప్పు అన్నాడు. ముందుగా అనుకున్నట్టుగానే నేను కూడా టీమ్ మీటింగ్‌లో విరాట్ పేరు చెప్పలేదు. అంతే మీటింగ్ అవ్వగానే విరాట్ కోహ్లీ తన రూమ్‌కి వెళ్లి ఏడవడం మొదలెట్టాడు. వెంటనే.. కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ సర్‌కి ఫోన్ చేసి.. సర్, నేను ఈ సీజన్‌లో 200-250 పరుగులు చేశాను. రెండు, మూడు మ్యాచుల్లో స్కోరు చేయలేదని పక్కనబెట్టేస్తారా అంటూ గట్టిగా ఏడవడం మొదలెట్టాడు.
According To Star Sports Hindi Commentators
Delhi picked Pradeep Sangwan Instead of Virat Kohli in Ipl 2008 Because They Said They Didn’t Need Another Batsman, They had Virendra Sehwag and AB de villiers. But RCB Picked him up and The Rest, As They Say, Is History pic.twitter.com/lRMPXCKigY
— Simran_HateMayra (@Simran_hatMayra) May 5, 2022
ఇది కూడా చదవండి: Virat Kohli: ఫామ్‌లో లేక పోయినా.. కింగ్ కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది!
కొద్దిసేపటికి తర్వాత నా దగ్గరికి వచ్చి ‘చెప్పు సాంగ్వాన్, నేనేం తప్పు చేశా. ఈ సీజన్‌లో చాలా పరుగులు చేశా కదా.. నన్ను పక్కకు పెట్టడం తప్పుకాదా’ అన్నాడు. నేను ‘అవును.. నిన్ను పక్కనబెట్టడం తప్పే’ అన్నాను. ఆ రోజంతా విరాట్ కోహ్లీ నిద్ర పోలేదు. వెళ్లి పడుకోమ్మని చెప్పాను. ‘లేదు.. నేను నిద్ర పోను. నేను ఆడనప్పుడు నిద్ర పోవడం ఎందుకు’ అన్నాడు. ‘ఒరేయ్ ఇదంతా ప్రాంక్.. నిన్ను ఏడిపించడానికి అజిత్ సర్ ఇలా చెప్పారు’ అని చెప్పాను. ఆ మాట విన్నాకే కోహ్లీ వెళ్లి నిద్రపోయాడు’ అని సాంగ్వాన్ చెప్పుకొచ్చాడు.
— Govardhan Reddy (@gova3555) June 9, 2022
ఇది కూడా చదవండి: Virat Kohli: వెకేషన్ లో అనుష్కతో ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ! ఫోటో వైరల్!
విరాట్ కోహ్లీ ఆన్‌ఫీల్డ్‌లో ఎంత దూకుడుగా వ్యవహరిస్తాడే, అంతే ఎమోషనల్ పర్సన్ కూడా. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఓడినప్పుడు, ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఓడినప్పుడు.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ అవ్వడం ఇప్పటికే మనం చాలా సార్లు చూశాం. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.