సాధారణంగా క్రికెటర్లకు 35 సంవత్సరాలు వచ్చాయి అంటే చాలు.. వారిని సీనియర్లుగా భావించి రిటైర్మెంట్ తీసుకోవాలని సూచిస్తుంటారు కొంతమంది మాజీ క్రికెటర్లు. అదీకాక ఓ వయసంటూ వచ్చాక ఆటగాళ్లలో సైతం శక్తి తగ్గుతూ వస్తుంది. అయితే అలా శక్తి అందరిలో తగ్గుతుంది అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే.. విధికి విరుద్దంగా కొందరు ఆటగాళ్లు ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఆటగాళ్లలో విండీస్ పవర్ హౌజ్ కీరన్ పొలార్డ్ ఒకడు. తాజాగా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన పొలార్డ్ యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికట్ లీగ్ టీ20 లో చెలరేగుతున్నాడు. ఈ టీ20 లీగ్ లో ముంబై ఎమిరైట్స్ కు సారథ్యం వహిస్తున్న పొలార్డ్ మలి వయసులో చెలరేగిపోతున్నాడు. తాజాగా దుబాయ్ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు
కీరన్ పొలార్డ్.. పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కు కేరాఫ్ అడ్రస్. కరేబియన్ లీగ్ అయినా ఐపీఎల్ అయినా తనదైన శైలిలో చెలరేగిపోతాడు ఈ విండీస్ స్టార్. ముంబై ఇండియన్స్ కు వీడ్కోలు పలికిన తర్వాత పలు టీ20 లీగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నా పొలార్డ్. అందులో భాగంగానే యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లో ముంబై ఎమిరైట్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం దుబాయ్ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపాన్నే చూపాడు పొలార్డ్. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీమ్ 6 ఓవర్లకు 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
దాంతో అందరు ముంబై ఓటమి ఖాయం అనుకున్నారు. అప్పుడే క్రీజ్ లోకి వచ్చాడు పొలార్డ్. వచ్చీ రావడంతోనే క్యాపిటల్స్ బౌలర్లపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 6 ఓవర్లకు 26 పరుగులతో ఉన్న స్కోరు బోర్డును 15 ఓవర్లకు 144 పరుగులకు చేర్చాడు. దాంతో పొలార్డ్ మరో నాలుగు ఓవర్లు ఉంటే.. మ్యాచ్ ముగిసేదే అని అందరు భావించారు. 38 బంతులు ఎదుర్కొన్న పొలార్డ్ 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్లు కోల్పోయి 206 పరుగుల వద్ద నిలిచింది. పొలార్డ్ కు జతగా సమిత్ పటేల్ 6 బాల్స్ లో 2 సిక్స్ లు, ఓ ఫోర్ తో 18 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
Kieron Pollard was in top gear, but it wasn’t enough for MI Emirates in a chase of 223 against Dubai Capitals #ILT20
— ESPNcricinfo (@ESPNcricinfo) January 22, 2023
అయితే పొలార్డ్ ఇంతటి వీరోచిత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు విండీస్ హిట్టర్. ఇక వయసు పెరుగుతున్నా గానీ తనలో మునుపటి పవర్ ఇంకా తగ్గలేదు అని చెప్పడానికి ఈ ఇన్నింగ్స్ ఓ మచ్చుతునక మాత్రమే. ఇక క్యాటిటల్స్ ఇన్నింగ్స్ లో మరో విండీస్ వీరుడు రోవ్ మన్ పావెల్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్ లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరి వయసు పెరుగుతున్నా గానీ తనలో వేడి ఇంకా తగ్గలేదని నిరూపిస్తున్న పొలార్డ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ten sixes 🔥
Captain Rovman Powell leads Dubai Capitals to an imposing 222 against MI Emirates #ILT20
— ESPNcricinfo (@ESPNcricinfo) January 22, 2023