పాకిస్థాన్ సూపర్ లీగ్-2023 ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను నిర్వాహకులు అర్ధాంతరంగా ఆపేశారు. మ్యాచ్ జరుగుతున్న క్వెట్టా నగరంలో బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలోకి కొందరు రాళ్లు విసిరారు. అలాగే స్టేడియం బయట నిప్పటించారు. దీంతో నిర్వాహకులు ఆటను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, క్వెట్టా నగరంలో ఆదివారం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్వెట్టాలోని ఎఫ్‌సీ ముస్సా చెక్ పాయింట్ వద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగిందని సమాచారం. ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అసలే ఆర్థిక మాంద్యంతో, ఆకలి కష్టాలతో పాక్ జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. ఈ బాంబు పేలుళ్లు వారిలో మరింత కలవరం సృష్టిస్తున్నాయి. ఇక, బాంబు పేలుడు ఘటనతో క్వెట్టాలో జరుగుతున్న పీఎస్ఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను ఆపేశారు. మరోవైపు మ్యాచ్ జరుగుతున్న బుగ్తీ స్టేడియం గ్రౌండ్ లోకి కొందరు వ్యక్తులు బయటి నుంచి రాళ్లు విసరడంతో మధ్యలోనే మ్యాచ్ ను ఆపేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మ్యాచ్ నిలిపివేయడానికి స్పష్టమైన కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు.
క్వెట్టాలో ఇవాళ జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఎవరైనా చనిపోయారా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పేలుడు ఎలా సంభవించిందనే దాని మీద పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవలే పెషావర్ సిటీలోని ఓ మసీదులో భారీ బాంబు పేలుడు జరిగిన సంగతి విదితమే. ఈ ఘటనలో దాదాపుగా 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను మరువక ముందే దాయాది దేశంలో మరో బ్లాస్ట్ జరిగింది. ఇకపోతే, ఈ ఏడాది జనవరిలో క్వెట్టాలో గ్యాస్ లీకేజీ ఘటన చోటుచేసుకుంది. ఇందులో సుమారు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు బాంబ్ పేలుడు ఘటనతో క్వెట్టా ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#BreakingNews
Just a clarification
No bomb blast near bugti stadium
The match is stopped because some persons from outside threw stones and put something on fire
They are being identified.
#pervezmusharraf #PeshawarZalmi #PSL8 #ShahidAfridi #Quetta #ShaheenShahAfridi#PZvsQG pic.twitter.com/C7P87aaN7h— HaMza (@imhamzaa12) February 5, 2023
Two people severely left injured in a massive blast in Pakistan’s Quetta. #Pakistan #Quetta #Blast pic.twitter.com/WvUE66xkUY
— Mirror Now (@MirrorNow) February 5, 2023