స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్ లో పాకిస్తాన్ వరుస పరాజయాలు చవిచూస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడిన పాక్.. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ని 2-0తో కోల్పోయింది. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కడవరకు పోరాడిన పాక్ 26 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఈ పరాజయాలను పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏళ్ల తరబడి దేశంలో మ్యాచులు జరగకపోవడం, గెలిచే అవకాశం ఉన్నా చేజేతులా కాజేయడంతో స్టేడియంలోనే తమ అసహనాన్ని వెళ్లగక్కారు. పాక్ సారధి బాబర్ ఆజాంను ఘోరంగా అవమానించారు.
గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతోన్న క్రికెటర్లలో పాక్ సారధి బాబర్ ఆజాం ఒకడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. ఐసీసీ ర్యాంకుల్లో టాప్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టులో సైతం సెంచరీ(136) చేశాడు. కానీ, కీలకమైన రెండో టెస్టులో మాత్రం విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 75 పరుగులు చేసి పర్వాలేదనిపించిన బాబర్, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో సహనం కోల్పోయిన పాక్ అభిమానులు అతడిని దారుణంగా ట్రోల్ చేశారు. ఔటై పెవిలియన్ చేరుతున్న సమయంలో.. ‘జింబాబర్.. జింబాబర్.. ‘ అంటూ నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Pakistani crowd shouting “Zimbabar” & “Ghante ka king” at Babar Azam. 😭😭💉💉 pic.twitter.com/RJTkzHkN1N
— Adi (@WintxrfellViz) December 11, 2022
ముల్తాన్ టెస్టులో ఇంగ్లాండ్ నిర్దేశించిన 355 పరుగుల లక్ష్యాన్ని పాక్ చేధించలేకపోయింది. 328 పరుగులకే పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మిడిలార్డర్ బ్యాటర్లు సాద్ షకీల్ (94), ఇనాముల్ హక్ (60) రాణించగా, అబ్దుల్ షఫీక్(40), మహమ్మద్ నవాజ్(45) పరుగులతో పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో పేసర్ మార్క్‌వుడ్ నాలుగు వికెట్లతో (4-65) పాక్ పతనాన్ని శాసించగా, రాబిన్ సన్(2), జేమ్స్ అండర్సన్(2) అతడికి చక్కటి సహకారం అందించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ కరాచీ వేదికగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.
England win the second Test by 2️⃣6️⃣ runs and take a 2️⃣-0️⃣ lead in the three-match series.#PAKvsENG pic.twitter.com/Gz0oHomGfJ
— 100MB (@100MasterBlastr) December 12, 2022