క్రీడా రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన ‘రాజశ్రీ స్వెయిన్’ అనే యువ మహిళా క్రికెటర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. రెండు రోజుల క్రితం శిక్షణా శిబిరం నుంచి ఇంటికి బయల్దేరిన ఆమె.. అటవీ ప్రాంతంలో చేట్టుకు వేలాడుతూ కనిపించింది. కటక్ సమీపంలోని దట్టమైన అడవిలో శుక్రవారం ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. రాజశ్రీ మృతదేహం గురుడిఝాటియా అడవిలోని ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
అదృశ్యమైన మరుసటి రోజే ఆమె శవమై కనిపించడం, శరీరంపై పలు చోట్ల గాయాలు, ఫోన్ స్విఛాఫ్ ఉండటం, ఘటనా స్థలానికి కొంత దూరంలో రాజశ్రీ స్కూటీ పడివుండటం.. ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. మృతురాలి కుటుంబసభ్యులు కూడా ఆమెను ఎవరో హత్య చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసినట్లు కటక్ డిఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు. ఆమె మరణానికి కారణం ఏంటన్నదిది తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. రాజశ్రీ జనవరి 11న అదృశ్యమైంది. శిక్షణా శిబిరం నుంచి ఇంటికి బయల్దేరిన ఆమె ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆమె కోచ్ జనవరి 11న మంగళబాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
త్వరలో పుదుచ్చేరి వేదికగా జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కోసం ఒడిశా క్రికెట్ అసోసియేషన్(ఓసీఏ) బజ్రకబాటి ప్రాంతంలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించింది. ఈ క్యాంప్ లో రాజశ్రీతో పాటుగా మరో 25 మంది మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు. వీరంతా అక్కడే స్థానికంగా ఉన్న ఒక హోటల్‌లో ఉంటున్నారు. అయితే జనవరి 10న నేషనల్ టోర్నమెంట్‌కు ఎంపికైన వాళ్ల పేర్లను ఓసీఏ ప్రకటించింది. అందులో రాజశ్రీకి చోటుదక్కలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ మరుసటి రోజు మిగతా క్రీడాకారిణిలందరూ ప్రాక్టీస్ కోసం వెళ్లగా.. ఆమె మాత్రం పూరీలోని తండ్రి దగ్గరకు వెళ్తున్నట్టు కోచ్‌కు చెప్పింది. అయితే.. ఆమె ఇంటికి వెళ్లలేదని తెలియడంతో కోచ్ మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rajashree Swain, a woman cricketer from Odisha found dead near Cuttack forest!#CricketTwitter pic.twitter.com/Z55HnbvsbL
— CRICKETNMORE (@cricketnmore) January 13, 2023