క్రిస్ కెయిన్స్.. ఈ మధ్య కాలంలో క్రికెట్ తెలిసిన వాళ్ళకి ఇతను ఎంత ప్రమాదమైన ఆటగాడో తెలియదు. కానీ.., 1990వ దశాబ్దంలో క్రిస్ కెయిన్స్ విధ్వంసం చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదు. అతను బంతిని ఊచ కొత కొస్తుంటే, ఎంతటి ప్రత్యర్థి జట్టైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇక బౌలింగ్ లోను క్రిస్ కెయిన్స్ సత్తా మాటలకి అందనిది. ప్రపంచ క్రికెట్ లో మొత్తం 5 వేళ్ళతో బంతిని స్వింగ్ చేయగల ఒకే ఒక క్రికెటర్ అతను. తన దేశం తరుపున క్రికెట్ లో ఇంత సాధించినా, రిటైర్డ్ అయ్యాక క్రిస్ కెయిన్స్ జీవితం సాఫీగా సాగలేదు.
ఒకానొక సమయంలో మొత్తం సంపద పోగొట్టుకుని రోజువారీ పనులకి వెళ్లి.., పొట్ట నింపుకోవాల్సిన స్థితికి చేరుకున్నాడు క్రిస్ కెయిన్స్. ఇక తాజాగా ఈ మాజీ క్రికెటర్ అనారోగ్యానికి గురి అయ్యాడు. గుండె లోపల నీరు చేరడంతో.. తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. సిడ్నీలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి క్రిస్ కెయిన్స్ ని తరలించారు. వైద్యులు అతన్ని పరిశీలించి ఆపరేషన్లు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. క్రిస్ కెయిన్స్ కి ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు.