సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు గాయపడితే.. అతడి స్థానంలో మరో ఆటగాడు బరిలోకి దిగుతాడు. కానీ తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ మ్యాచ్ లో ఆటగాళ్లు గాయపడటంతో కోచ్ తో పాటుగా అసిస్టెంట్ కోచ్ కూడా మైదానంలోకి దిగి ఫీల్డింగ్ చేశారు.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. ఫ్యాన్స్ తమ అభిమాన ఆటగాళ్ల కోసం గ్రౌండ్ లోకి పరిగెత్తుకు రావడం. ఆటగాళ్లు మైదానంలోనే ఘర్షణకు దిగటం, లవర్స్ ప్రపోజ్ చేసుకోవడం, అభిమానులపై ఆటగాళ్లు కోపాన్ని ప్రదర్శించడం లాంటి ఎన్నో సంఘటనలు చూశాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన గురించి మీరు క్రికెట్ చరిత్రలో ఎప్పుడు చూసుండరు, విని ఉండరు. అయితే ఇదేదో గల్లీ క్రికెట్ లోనో, టీ20 లీగ్స్ లోనో జరగలేదు. ఓ అంతర్జాతీయ మ్యాచ్ లోనే జరిగింది. అదేంటంటే? ఆటగాళ్లకు బదులుగా ఓ క్రికెట్ జట్టు కోచ్, అసిస్టెంట్ కోచ్ మైదానంలోకి దిగి ఫీల్డింగ్ చేశారు.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగే సమయంలో ఆటగాళ్లకు గాయాలు అవ్వడం సహజమే. అప్పుడు వారి ప్లేస్ లో టీమ్ లో ఉన్న ఇతర ఆటగాళ్లు సబ్ స్టిట్యూట్ గా మైదానంలోకి దిగుతుంటారు. కానీ తాజాగా నమీబియా-నేపాల్ దేశాల మధ్య జరిగిన మ్యాచ్ లో ఫీల్డర్లు గాయపడితే ఏకంగా హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్ లే ఫీల్డింగ్ చెయ్యాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. స్కాంట్లాండ్, నేపాల్, నమీబియా దేశాల మధ్య ప్రస్తుతం ఓ ట్రై సిరీస్ జరుగుతోంది. అందులో భాగంగానే తాజాగా నమీబియా-నేపాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఓ అరుదైన దృశ్యానికి వేదికైంది.
నేపాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నమీబియా టీమ్ లోని నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. ఈ క్రమంలో జట్టులో బ్యాకప్ ప్లేయర్స్ లేకపోవడంతో.. ఆ జట్టు కోచ్ జోహన్ రుడాల్ఫో తో పాటుగా అసిస్టెంట్ కోచ్ అల్బీ మోర్కెల్ లు మైదానంలోకి దిగి ఫీల్డింగ్ చేశారు. ప్రస్తుతం వారు ఫీల్డింగ్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే జట్టులో సరిపడా సబ్ స్టిట్యూట్ ప్లేయర్స్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 274 పరుగులు చేసింది. అనంతరం 275 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు మరో 15 బంతులు ఉండగానే విజయం సాధించింది. 47.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరి ఆటగాళ్లు లేకపోవడంతో ఫీల్డింగ్ చేసిన కోచ్, అసిస్టెంట్ కోచ్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Namibian Assistant Coach Albie Morkel and Head Coach doing fielding for Namibia after their 4 players got injured during the Nepal tour. pic.twitter.com/VhCTdfuof2
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2023