టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ విషయంలో చెప్పిన ఒక విషయం ఇప్పుడు అక్షరసత్యమైంది. ఆటలో ప్లేయర్ల మైండ్ అండ్ బిహేవియర్‌ను చదివే ధోనికి.. బెన్ స్టోక్స్ కచ్చితంగా 10 ఏళ్లలోపు ఇంగ్లండ్ క్రికెట్ జట్టును నడిపిస్తాడని అన్నాడు. 2017లో ధోని చెన్నై సూపర్ కింగ్స్‌పై నిషేధం విధించడంతో కొత్త టీమ్ రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో బెన్ స్టోక్స్ కూడా అదే జట్టుకు ఆడేవాడు. అప్పటికీ స్టోక్స్ అంత గొప్ప ప్లేయరేం కాదు.
కానీ.. అతనిలోని లీడర్‌షిప్ క్వాలిటీని పసిగట్టిన ధోని.. ఇప్పటికైతే బెన్ స్టోక్స్ గొప్ప ఆటగాడిగా కనిపించకపోవచ్చు.. కానీ కరెక్ట్‌గా పదేళ్లలోపు అతని జాతీయ జట్టుకు సారథ్యం వహిస్తాడని చెప్పాడు. తాజాగా ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతని స్థానంలో బెన్‌స్టోక్స్ ఆ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు ఇంగ్లండ్ టెస్ట్ టీమ్‌కు బెన్‌స్టోక్స్ కెప్టెన్. దీంతో 2017లో బెన్ స్టోక్స్ గురించి ధోని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ధోని గొప్ప ఆటగాడు కాబట్టే.. కెరీర్ ఆరంభంలోనే ఒక ఆటగాడిలో దాగిఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించడంటూ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ధోనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదీ చదవండి: David Warner: అరుదైన ఘనత సాధించిన వార్నర్! IPLలోనే తొలి ప్లేయర్
MS Dhoni in 2017 on #BenStokes : He might not seem like a great player now but within the next 10 years he will not only be a great cricketer but will also lead his country, I see a leader in him.
Today Ben Stokes became the Test Captain of England.
MS ♥️ pic.twitter.com/HRxCUcrmSf
— Roshan Rai (@RoshanKrRaii) April 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.