భారత-వెస్టిండీస్ మధ్య ఆదివారం అహ్మాదాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను టీమిండియా బౌలర్లు 176 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం కేవలం 4 వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌ను మొహమ్మద్ సిరాజ్ పడగొట్టాడు. వెస్టిండీస్ ఓపెనర్ హోప్‌ను బౌల్డ్ చేసి భారత్‌కు పవర్‌ప్లేలో బ్రేక్‌త్రూ అందించాడు.
Siraj is back and India gets the powerplay wicket in ODI.
Siuuuuuu Celebration 🔥 pic.twitter.com/ERPjdjYVP4
— . (@_VkSk) February 6, 2022
కాగా ఆ వికెట్‌కు ముందు రెండు బంతులను హోప్ బౌండరీకి తరలించాడు. తొలి ఓవర్‌ను మెడిన్‌గా వేసిన సిరాజ్.. తన తర్వాతి ఓవర్ 2,3వ బంతుల్లో ఫోర్లు కొట్టించుకున్నాడు. అయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా.. తర్వాతి బంతిని ఇన్ స్వింగర్‌గా వేశాడు. ఆ బంతి హోప్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను పడగొట్టింది. దీంతో వరుస బంతుల్లో ఫోర్లు పోయిన తర్వాత కూడా అద్భుతబంతితో భారత్‌కు వికెట్ అందించిన సిరాజ్ సంబరాలు ఒక రేంజ్లో చేసుకున్నాడు. తన బౌలింగ్‌లో పరుగులు రాబట్టిన బ్యాట్స్‌మెన్‌కు బంతితోనే సమాధానం ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు. కాగా సిరాజ్ హోప్‌ను అవుట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి సిరాజ్ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.