మ్యాచ్ గెలవాలనే కసి గాయమైనా, రక్తం కారుతున్నా లెక్క చేయనివ్వదు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఓ బౌలర్ చేతి నుంచి రక్తం కారుతున్నా బౌలింగ్ కొనసాగించాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా మూడో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా దారుణంగా విఫలమైంది. ఆసీస్ స్పిన్ ఎటాక్ ముందు భారత బ్యాటర్లు నిలువలేకపోయారు. కేవలం 109 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయి దారుణంగా నిరాశ పర్చింది. ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా 25 పరుగుల మార్క్‌ను దాటలేకపోయారు. కోహ్లీ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు పూర్తిగా పైచేయి సాధించింది. 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి తొలి రోజును సంతృప్తికరంగానే ముగించింది.
ఇక రెండో రోజు భారీ స్కోర్ చేసి.. మంచి లీడ్ సాధించాలని ఆస్ట్రేలియా భావించింది. కానీ.. వారి ఆశలపై అశ్విన్, ఉమేష్ యాదవ్ నీళ్లు చల్లారు. కేవలం 41 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లను కూల్చి, ఆసీస్ భారీ లీడ్ ఆశలను అడియాశలు చేశారు. 156 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్, ఉమేష్ యాదవ్ చెలరేగడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. చెరో మూడు వికెట్లు తీసుకున్న అశ్విన్, ఉమేష్.. ఆసీస్‌ను 88 పరుగుల లీడ్‌కే పరిమితం చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్, భారీ లీడ్ ఆశలు పతనం కావడంతో ఆస్ట్రేలియా చాలా కసిగా బౌలింగ్‌కు దిగింది.
భారత్‌ను రెండో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసిన మ్యాచ్‌ను గెలిచి పరువు నిలుపుకోవాలనే పట్టుదల వారిలో కనిపించింది. రెండో రోజు తొలి సెషన్‌లోనే పిచ్ స్పిన్నర్లతో పాటు పేసర్లకు అనుకూలంగా ఉండటంతో ఆస్ట్రేలియా సైతం పేస్ బౌలర్‌తోనే వికెట్ల ఆరంభించింది. మిచెల్ స్టార్క్ తొలి ఓవర్ వేశాడు. అయితే.. స్టార్క్ చేతి వేళ్లకు తీవ్ర గాయం కాగా.. అలాగే బౌలింగ్ కొనసాగించాడు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా తీసుకోకుండా బౌలింగ్ వేసిన స్టార్క్ పట్టుదలకు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. రక్తం కారుతున్నా.. మ్యాచ్ గెలవాలనే కసితో స్టార్క్ తన గాయాన్ని పట్టించుకోకుండా బౌలింగ్ వేయడంపై నిజంగా గొప్ప విషయమంటూ అభినందిస్తున్నారు. కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 96 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. పుజరా 43, శ్రేయస్ అయ్యర్ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌లో చేతికి గాయమైనా, రక్తం కారుతున్నా స్టార్క్ బౌలింగ్ వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#mitchellstarc #BGT2023 #INDvsAUSTest pic.twitter.com/1uiYZe3IZQ
— Sayyad Nag Pasha (@nag_pasha) March 2, 2023