ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన టీ20 లీగ్ ఏదంటే.. అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు.. ఐపీఎల్. ఈ లీగ్ రాకతో క్రికెట్ ఆడే దేశాల్లో స్థానిక టీ20 లీగులు విపరీతంగా పుట్టుకొచ్చాయి. బిగ్‌బాష్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లా ప్రీమియర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్.. ఇలా ఒక్కటేమిటి చాలానే ఉన్నాయి. అయితే.. ఈ మధ్యనే ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరిపోయింది.
క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు.. ఐపీఎల్ తరహాలో టీ20 లీగును ఆరంభించనుంది. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న ‘క్రికెట్ సౌతాఫ్రికా టీ20’ లీగ్ లో భాగంగా కేప్‌టౌన్ ఫ్రాంచైజీని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జట్టు తరఫున ఆడబోయే ఆటగాళ్లను పరిచయం చేసింది. దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్ బ్రెవిస్ (అన్ క్యాప్డ్), కగిసొ రబాడా లతో పాటు ముగ్గురు విదేశీ ఆటగాళ్లను కూడా తీసుకుంది. ముగ్గురిలో సామ్ కరన్, లియామ్ లివింగ్ స్టోన్ ఇంగ్లాండు ఆటగాళ్లు కాగా, ఐదో ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను తీసుకుంది.
2️⃣ 🇿🇦 | 2️⃣ 🏴 | 1️⃣ 🇦🇫
Read more on our first group of players joining @MICapeTown – https://t.co/68DXpU0DNp#OneFamily #MIcapetown @OfficialCSA pic.twitter.com/Ht9f5XgeOy
— MI Cape Town (@MICapeTown) August 11, 2022
పైన పేర్కొన్న ఐదుగురిలో డెవాల్డ్ బ్రెవిస్ ఇప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నవాడే. ఆల్ రౌండర్ల కోటాలో లివింగ్‌స్టోన్, సామ్ కరన్ కీలకం కానుండగా, రబడా, రషీద్ ఖాన్లు అగ్రశ్రేణి బౌలర్లైనా బ్యాటింగ్ చేయగల సత్తా కూడా ఉంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Some of the major signings in CSA T20 league:
MI – Rashid Khan, Liam Livingstone, Kagiso Rabada, Sam Curran.
CSK – Faf Du Plessis, Moeen Ali.
DC – Anrich Nortje.
SRH – Aiden Markram.
RR – Jos Buttler.
LSG – De Kock.(Source – Cricbuzz)
— Johns. (@CricCrazyJohns) August 11, 2022
ఇదీ చదవండి: Will Smeed: దంచికొట్టిన విల్స్మీడ్! ది హండ్రెడ్‌లో తొలి హండ్రెడ్
ఇదీ చదవండి: MS Dhoni: ‘గురూజీ’ అవతారంలో ఎంఎస్ ధోనీ.. దేని కోసం ఇదంతా!